Viral video: పచ్చడి గురించి అడిగితే పిచ్చిపిచ్చిగా తిట్టింది.. అవేం బూతులురా బాబో..!

అలేఖ్యచిట్టిపికిల్స్ ఓనర్ కస్టమర్‌ను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పచ్చళ్లు ఎందుకు అంత రేటు ఉన్నాయని అడిగిన కస్టమర్‌‌ను వాట్సాప్‌లో ఆడియో మెస్సేజ్‌లో దారుణంగా తిట్టింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజర్లు వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

New Update
alekhya chitti pickles

alekhya chitti pickles Photograph: (alekhya chitti pickles)

పాములు పట్టేవాడు పాముకాటుకే బలైపోయినట్లు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల పెరిగిన బిజినెస్, ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్‌ దెబ్బకు మూతపడటానికి వచ్చింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అలేఖ్యచిట్టి పికిల్స్ అనే పచ్చళ్ల బిజినెస్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పుణ్యమా అంటూ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి పచ్చళ్ల బిజినెస్‌ను బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఆర్డర్ల కోసం ఆన్‌లైన్‌లో డెలివరీలు కూడా స్టార్ట్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా సోషల్ మీడియాలోనే అలేఖ్యచిట్టిపికిల్స్ అనే పేరును ఫుల్ వైరల్ చేశారు. ఓ కస్టమర్ పచ్చళ్ల కోసం వాట్సాప్ నెంబర్‌ను సంప్రదించాడు. అలేఖ్యచిట్టి పికిల్స్ రేట్లు వారు పంపించారు. పికిల్స్ ధరలు చూసిన కస్టమర్.. మీరు చాలా ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారని అడిగాడు.

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

దీంతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఓ యువతి కస్టమర్‌పై బూతులతో రెచ్చిపోయింది. వాట్సాప్‌లో బూతులు తిడుతూ ఆడియో మెస్సేజ్ పంపించింది. ఇంత రేటు పెట్టి పచ్చళ్లు కొనలేని నీదీ ఓ బతుకేనా అంటూ నీచంగా మాట్లాడింది. నీ లాంటి వాళ్లు లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే.. పెళ్లి చేసుకోవాలని పర్సనల్ విషయాలను టార్గెట్ చేస్తూ కస్టమర్‌ను ఆడిపోసుకుంది. నానా బూతులు తిట్టింది. అది విన్న కస్టమర్ ఆమె వాట్సాప్ ఆడియో మెస్సేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. పచ్చళ్లు ఎందుకు అంత రేటు ఎక్కువ ఉన్నాయంటే.. ఇష్టముంటే కొను, లేదంటే మానుకో అనాలి. లేదా మా పచ్చళ్లు ఇంతే అని చెప్పాలి. కానీ అమ్మానా బూతులు తిట్టడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో అలేఖ్యచిట్టిపికిల్స్ పచ్చళ్లు కొనొద్దని ఇంటర్‌నెట్‌లో ప్రచారం జరుగుతుంది. అక్కచెల్లెళ్లుకు ఇంత నోటిదూల ఎందుకని యూజర్లు మండిపడుతున్నారు. దీంతో అలేఖ్యచిటిపికిల్స్ సేల్స్ పడిపోతున్నాయి. ఆ పికిల్స్ కొనాలనుకునే వారు కూడా వాళ్ల బూతుపురాణం విని వెనక్కి తగ్గుతున్నారు. గతరెండు మూడు రోజులుగా సోషల్ మీడియా మొత్తంలో అలేఖ్యచిట్టిపికిల్స్ వాళ్లు కస్టమర్‌ను తిట్టిన వీడియోలే ట్రోల్ అవుతున్నాయి.

Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు