Pakistan : పాత ఇనుప సామాన్లకు పాక్ మిస్సైల్స్.. పాక్ పరువు గోవింద గోవిందా!(VIDEO)

పాక్ ప్రయోగించిన మిస్సైల్స్ ను భారత్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది.  హర్యానాలోని సిర్సాలో శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్ క్షిపణిని వైమానిక దళం ధ్వంసం చేసింది. ధ్వంసమైన మిస్సైల్ భాగాలను కొందరు కుర్రాళ్లు తరలిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

New Update
pakistan missiles

pakistan missiles

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో భారత్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ ను  చేపట్టింది. దీంతో ఇండియా, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారత్ చర్యలకు ప్రతిస్పందనగా పాక్ ప్రయోగించిన మిస్సైల్స్ ను భారత్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. తాజాగా  హర్యానాలోని సిర్సాలో శుక్రవారం అర్ధరాత్రి 12:10 గంటలకు పాకిస్తాన్ క్షిపణిని వైమానిక దళం ధ్వంసం చేసింది. ఒక అవశేషం రానియన్‌లో, మరొకటి నగరానికి సమీపంలోని ఖాజాఖేడా గ్రామంలో పడింది.  పెద్ద పేలుడు శబ్దంతో సమీపంలోని స్థానికులు భయపడి వెంటనే అక్కడికి గుమిగూడారు.  

సోషల్ మీడియాలో వైరల్

ధ్వంసమైన మిస్సైల్ భాగాలను కొందరు కుర్రాళ్లు తరలిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలపై  నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పాక్ మిస్సైల్స్ పాత ఇనుప సామాన్లకు పనికి వస్తు్న్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇదిలా ఉండగా, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి), అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి భారత నగరాలపై పాకిస్తాన్ సైన్యం చేసిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా భారత సైన్యం జమ్మూ సెక్టార్‌లో గట్టిగా ప్రతీకారం తీర్చుకుందని రక్షణ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తరాన బారాముల్లా నుండి పశ్చిమాన భుజ్ వరకు అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్‌లను కూల్చివేసింది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు