Rules for Undergarments: ఇదెక్కడి వింతరా అయ్యా.. డ్రాయర్స్ కోసం ప్రత్యేక చట్టాలు..

నేరాల నియంత్రణకు చట్టాలు చేయడం చూశాం.. ప్రజల ప్రాథమిక హక్కుల రక్షణ కోసం చట్టాలు చేయడం చూశాం.. ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయడం చూశాం.. కానీ, లోదుస్తుల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయని మీకు తెలుసా? అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.

New Update
Rules for Undergarments: ఇదెక్కడి వింతరా అయ్యా.. డ్రాయర్స్ కోసం ప్రత్యేక చట్టాలు..

Rules And Regulations For Undergarments : అమెరికా(America), స్పెయిన్(Spain) లోనే కాకుండా థాయ్ లాండ్ లోనూ అండర్ గార్మెంట్స్(Undergarments) కు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయట. ఇక్కడ చట్టాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రజలు లోదుస్తులు ధరిస్తారు. స్త్రీ, పురుషుడైనా.. ఏ వయస్సు వారైనా.. అందరూ లోదుస్తులు ధరిస్తారు. అయితే, ఇవాళ మనం చెప్పుకోయే దేశాల్లో లోదుస్తులకు సంబంధించి వివిధ రకాల చట్టాలు ఉన్నాయట. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద డిస్కషనే నడుస్తోంది. మరి ఆ దేశాలు ఏంటి? ఆదేశాల్లో లోదుస్తులకు సంబంధించి రూపొందించిన ప్రత్యేకమై చట్టాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

US చట్టాలు..

అమెరికాలోని కొన్ని ప్రదేశాలలో లోదుస్తులకు సంబంధించి ప్రత్యేకమైన నియమాలు, నిబంధనలు ఉన్నాయట. మిన్నెసోటాలో పురుషులు, స్త్రీల లోదుస్తులను కలిపి ఆరబెట్టడం చట్టవిరుద్ధం అని ఒక నియమం ఉంది. అమెరికాలోని మిస్సౌరీ విషయానికి వస్తే.. ఇక్కడి అమ్మాయిలు ఇన్నర్‌వేర్ ధరించరట.

స్పెయిన్ చట్టాలు..

స్పానిష్ నగరమైన సెవిల్లెలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ లోదుస్తులను బయట ఆరబెట్టడం నేరం. ఎవరైనా తమ లోదుస్తులను బయట ఆరబెడితే బయటకు కనిపించకుండా ఒక గుడ్డ కప్పి ఆరబెడతారట. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం కూడా ఉందట. అయితే, ఇక్కడకి వెళ్లిన ఓ పర్యాటకుడు తన లోదుస్తులను ఆరుబయట ఆరబెడితే.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. ఆ తరువాత తనకు ఈ నిబంధనలు తెలియవని, మరోసారి రిపీట్ చేయనని వివరణ ఇస్తే వదిలేశారట.

థాయ్ చట్టం..

అమెరికా, స్పెయిన్ లోనే కాకుండా థాయ్ లాండ్ లోనూ అండర్ గార్మెంట్స్ కు సంబంధించి చట్టం ఉందని పేర్కొంటున్నారు నెటిజన్లు. థాయ్‌లాండ్‌లో అండర్‌గార్మెంట్స్‌కు సంబంధించి ఎవరూ అండర్‌గార్మెంట్స్ ధరించకుండా ఇంటి నుండి బయటకు రాకూడదని చట్టం ఉందట. అయితే, ఈ చట్టం చేయడం వెనుక ప్రభుత్వ లక్ష్యానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారమేమీ లేదు. కానీ, మీరు థాయ్‌లాండ్‌ని సందర్శించబోతున్నట్లయితే, లోదుస్తులకు సంబంధించి నియమాలు, నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకుని వెళ్లాల్సిందే.

Also Read:

ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి

Advertisment
తాజా కథనాలు