భారత్ లో ఒక నెలలో 2 లక్షలకుపైగా ఎక్స్ ఖాతాలు తొలిగింపు!
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొంది.