Viral News: తుమ్ములు అనేది వ్యాధి కాదు. ఇది అందరిలో కనిపించే సాధారణ సమస్య. కొన్నిసార్లు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు విపరీతంగా తుమ్ములు వస్తాయి. జలుబు అయినప్పుడు కూడా వస్తాయి. చెత్త, దుమ్ము, సడెన్‌గా సూర్యుడిని, వెలుతురును చూడటం వల్ల కూడా తుమ్ములు వస్తాయి. అందుకే తుమ్ములను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అయితే అమెరికాకు చెందిన కైట్లిన్ థోర్న్‌లీ(20) అనే యువతికి తుమ్ములు పెద్ద సమస్యగా మారాయి. సాధారణంగా.. తుమ్ములు రోజుకు పది నుండి ఇరవై సార్లు వస్తాయి. కానీ ఈ యువతి రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది. LadyBible అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. కైట్లిన్ కొన్నిసార్లు నిద్ర కూడా పోకుండా రాత్రంతా తుమ్ముతూనే ఉంటుంది. ఈ తుమ్ములు కారణంగా యువతి నరకం అనుభవిస్తోందట. నిరంతర తుమ్ములతో యువతి శరీరం గుల్ల అయిపోతుందని వైద్యుల ముందు తన గోడు వెల్లబోసుకుంది.
కైట్లిన్ అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తోంది. సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ తుమ్ములు అలెర్జీ, ఇతర సమస్య కారణం వస్తున్నాయేమో అనుకుంది. ఈ సమస్య త్వరలోనే తగ్గిపోతుందులే అని లైట్ తీసుకుంది. కానీ తుమ్ములు రోజురోజుకూ పెరిగిపోయాయి. కైట్లిన్ నిమిషానికి 20 సార్లు, కొన్నిసార్లు రోజుకు 12 వేల సార్లు తుమ్ముతుంది. అలా సమస్య చాలా తీవ్రంగా మారింది. కనీసం ఏమీ తినలేని, తాగలేని పరిస్థితితో యువతి చాలా ఇబ్బంది ఎదుర్కొంటోంది.
నివేదికల ప్రకారం.. హ్యూస్టన్‌లోని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని వైద్యులు కైట్లిన్ వింత తుమ్ములను, దానికి గల కారణాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె తుమ్ములకు కారణం కనుగొనలేకపోయారు. 2015లో ఆమె వింత వ్యాధి గురించి చాలా వార్తలు వచ్చాయి. అలాగే పలు మీడియా కూడా ఆమెను ఇంటర్వ్యూ చేసింది. కానీ కైట్లిన్ ఇప్పటికీ ఈ తుమ్ముల సమస్యతో బాధపడుతోంది. ఆమె అనారోగ్యానికి కారణమేంటో వైద్యులు ఇప్పటికీ కనుగొనలేకపోయారు.
Also Read:
కాలు జారి కింద పడ్డ కేసీఆర్.. ఆస్పత్రిలో అడ్మిట్..
నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!