Viral Fevers: ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే.. లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా?

వాతావరణం చాలా ఎక్కువగా మార్పులు చెందుతోంది. వర్షాలు ఎప్పటికప్పుడు గట్టిగా పడుతున్నాయి. ఎండలకు ఎండలూ అలాగే ఉన్నాయి. దీంతో దేశంలో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద కూడా పడింది. చాపకింద నీరులా డెంగ్యూ కేసులూ పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్ హైదరాబాద్‌ను వణికిస్తున్నాయి. జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.

Viral Fevers: ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే..  లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా?
New Update

Viral Fevers: దేశ వ్యాప్తంగా డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్స్ టెన్షన్ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నగరాన్ని వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో డెంగ్యూ దోమలు మరింత ఎక్కువగా వ్యాప్తి చెంది జనాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో జనాలు అల్లాడిపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వైరల్ ఫీవర్ అని రిపోర్ట్ వస్తోంది. రాష్ట్రంలోని డెంగ్యూ కేసుల్లో 40శాతం హైదరాబాద్‌లో నమోదవుతున్నాయి. దీంతో బెంబేలెత్తిపోతున్నారు సిటీ జనాలు.

రోజుకో రకంగా ఉంటున్న వాతావరణ పరిస్థితులు, అపరిశుభ్రాలతో ప్రజలు బాధలు పడుతున్నారు. పల్లె, నగరం అని తేడా లేకుండా అన్ని చోట్లా దోమలు పెరిగిపోయాయి. వీటివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోంది. డయేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇవి కాకుండా దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతో భాదపడుతున్నవారు ఎక్కువే ఉన్నారు. వైరల్ ఫీవర్స్ లో డెంగీ లాంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇవి కూడా జనాలను మరింత భయపెడుతున్నాయి. డెంగీ జ్వరంలో బ్లడ్ లో ప్లేటెలెట్స్ పడిపోయి హాస్పటల్స్ లో జాయిన్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. చాలా మందికి రూమ్స్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. విష జ్వరాలు, వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో పరిశ్రుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మందులు కూడా ఎప్పుడూ దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వైరల్ ఫీవర్ లక్షణాలుః

వైరల్ ఫీవర్ అవునో కాదో తెలుసుకోవాలంటే ఈ లక్షనాలు ఉన్నాయో లేదో పరీక్సించుకోవాలి. చెమటలు అధికంగా పట్టడం, ఒళ్ళు నొప్పులు, చలి, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, వికారం లక్షణాలుంటాయి. సీజనల్ ఇన్‌ఫ్లూఎంజా/వైరల్ ఫీవర్ ఈజీగా వస్తుంది. స్కూల్స్, కాలేజెస్, సినిమా హాల్స్, సూపర్ మార్కెట్స్, పార్క్స్ ఇలా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది. సమస్య వచ్చిన వారు దగ్గినా, తుమ్మినప్పుడు వైరస్‌లు కలిగిన చుక్కలు గాలిలోకి వచ్చి.. మీటర్ వరకు వ్యాపిస్తాయి. ఈ బిందువులను పీల్చే దగ్గరి వ్యక్తులకు సోకుతుంది. వైరస్ కలుషితమైన చేతుల ద్వారా కూడా వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.

తీసుకోవాల్సి జాగ్రత్తలుః
వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్య ఎక్కువవుతుంది. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి, హైడ్రేట్‌గా ఉండాలి. సూప్స్, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్స్ సూచించిన ట్యాబ్లెట్స్ మాత్రమే వేసుకోవాలి. సొంత వైద్యం అస్సలు పనికిరాదు. తుమ్మడం, దగ్గడం చేసినప్పు నోరు, ముక్కు కవర్ అయ్యేలా చూసుకోవాలి. మంచి పోషకాహారం మూడు పూటలా తీసుకోవాలి. జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలని మర్చిపోకూడదు.

Also Read: ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

#health #doctors #sick #fevers #hospitals #viral-fevers #viral-fevers-reasons #viral-fevers-in-hyderabad #viral-fevers-symptoms
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe