Ireland: ఐర్లాండ్ లో బీభత్సం..ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి

ఐర్లాండ్ లో భయానక వాతావరణం నెలకొంది. అల్జీరియన్ ముస్లిమ్ తమ వారి మీద అటాక్ చేశాడని...ఐరిష్ ప్రజలు అక్కడి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని, బస్సులను తగులబెట్టారు.

Ireland: ఐర్లాండ్ లో బీభత్సం..ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి
New Update

ఐర్లాండ్ లో ప్రజలు భీభత్సం సృష్టించారు. ఇష్టానుసారంగా బస్సులను, ఇమ్మిగ్రేషన్ ఆఫీసులను తగలబెడుతూ రచ్చ చేశారు. అల్జేరియన్ ముస్లిమ్ తమ వారి మీద చేసిన దాడికి ప్రతీకారంగా ఈఐరిష్ ప్రజలు ఈ దారుణానికి పాల్పడ్డారు. అడ్డం వచ్చిన వారిని కొడుతూ, కార్లు, పోలీసు కార్లమీద కూడా దాడి చేశారు. అల్జేరియన్ కు చెందిన ముస్లిమ్ యువకుడు ఐర్లాండ్ కు చెందిన ముగ్గురు పిల్లలతో సహా 5గురి మీద విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇందులో ఒక మహిళ, పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది.

Also Read:డబ్ల్యూహెచ్వోకు కొత్తరకం న్యుమోనియా మీద వివరణ ఇచ్చిన చైనా

అయితే దాడి చేసిన అల్జేరియన్ యువకుడిని ఐర్లాండ్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనని కస్టడీలో కూడా ఉంచారు. దాడి చేసిన ముస్లిమ్ యువకుడికి మతిస్థిమితం లేదని...అందుకే దాడులకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. కానీ ఐర్లాండ్ ప్రజలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. మిడిల్ ఈస్ట్ కు చెందిన వారందరి మీద దాడులు చేస్తున్నారు. భారీ వలసల వల్ల ఐర్లాండ్ ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతోందని...దాని వల్ల జాతి విభేదాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. కానీ తమ లిబరల్ ప్రభుత్వం దీన్ని అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ జాతి విభేదాలను పక్కనపెట్టేసిందని ఆరోపిస్తున్నారు.

This browser does not support the video element.

This browser does not support the video element.

This browser does not support the video element.

Also Read:యుద్ధ విరమణకు వేళాయే.. నేటి నుంచే బందీల విడుదల

#clashes #immigration #violent #dublin #ireland
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe