Paris Olympics: ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారతీయ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ (Vinesh Phogat) ఇష్యూలో సీఏఎస్ (CAS) తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో తుది తీర్పును ఆగస్టు 11న అంటే రేపు ఇస్తామని డా.అనబెల్లె బెనెట్టే చెప్పారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ ఫైట్‌కు దూరమైన ఫోగాట్.. సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు తనకు పతకం (Silver Medal) ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ చేసిన విజ్ఞప్తిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తాత్కాలిక విభాగం దీని మీద విచారణ చేపట్టింది.
సెమీస్ లో తన చేతిలో ఓడిన క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిపి తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగట్ విజ్ఞప్తి చేసింది. వినేష్ తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆ పతకం వినేష్ కు మాత్రమే చెందాలని వాదించారు. విచారణ తర్వాత సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు భారత ఒలింపిక్ సంఘం, లాయర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు తీర్పు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ ఇది మళ్ళీ వాయిదా పడింది.
ప్రస్తుత పరిస్థితులపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పందిస్తూ.. వినేష్ పట్ల తనకు ఖచ్చితమైన అవగాహన ఉందన్నారు. ఆమె చిన్న కారణంతో ఫైనల్ పోటీనుంచి అనర్హతకు గురికావడం తనను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉందని చెప్పారు.
Also Read:Maldives: మాల్దీవుల అధ్యక్షుడి యూటర్న్–భారత్ తమకు ముఖ్యం అంటూ వ్యాఖ్యలు