Vinesh Phogat Retirement: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌పెట్టింది. సోషల్ మీడియా పోస్ట్‌లో, "అమ్మా, నా నుండి రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం, ప్రతిదీ విచ్ఛిన్నమైంది, ఇప్పుడు నాకు ఇంతకంటే బలం లేదు. కుస్తీకి గుడ్‌బై 2001-2024. అమ్మా నన్ను క్షమించు అంటూ క్షమాపణలు చెప్పింది. మీరంతా ఎప్పుడూ నా వెంటే ఉంటారని ఆశిస్తున్నానను అంటూ రాసుకొచ్చింది.
వినేష్ ఫోగాట్ తన పోటీదారుతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 5-0 తేడాతో గెలిచింది. అంతేకాకుండా ఒలింపిక్ (Paris Olympics 2024) ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా రికార్డులు సృష్టించింది.
'ఓడిపోలేదు, ఓడిపోయింది...'
వినేష్ ప్రకటన తర్వాత రెజ్లర్ బజరంగ్ పునియా స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. వినేష్, నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఎప్పుడూ మాకు విజేతవే, నువ్వు భారతదేశపు పుత్రివి, అలాగే భారతదేశానికి గర్వకారణం.
వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అనర్హురాలని, ఆ తర్వాత ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణ పతకానికి ముందు ఆగస్టు 7న భారత మహిళా రెజ్లర్ అథ్లెట్ వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమె మెడల్ మ్యాచ్‌కు ముందు వినేష్ బరువు నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మ్యాచ్ అధికారులు ఆమెను అనర్హులుగా ప్రకటించారు. వినేష్ ఫైనల్ వెళ్తే కచ్చితంగా బంగారు పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ అధిక బరువు కారణంగా, ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఆమె పై అనర్హత వేటుపడింది. అటువంటి పరిస్థితిలో, నిబంధనల కారణంగా, ఆమె సెమీ ఫైనల్స్ గెలిచిన తర్వాత కూడా పతకాన్ని కోల్పోయింది.
అమెరికా రెజ్లర్‌తో పోటీ పడాల్సి వచ్చింది
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్స్‌కు చేరుకున్న తర్వాత, ఆమె బంగారు పతకం గెలుస్తుందని అందరు అనుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో వినేష్ ఫోగాట్ 5-0తో క్యూబా రెజ్లర్ యూస్నీలీస్ గుజ్‌మాన్‌ను ఓడించింది. వినేష్ ఫైనల్ బుధవారం (ఆగస్టు 7) అమెరికాకు చెందిన ఆన్ సారా హిల్డెబ్రాండ్‌తో జరగాల్సి ఉంది. అంతకుముందు, ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో 50 కిలోల విభాగంలో ఒలింపిక్ ఛాంపియన్, నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ యుయి సుసాకిని ఓడించింది.