రెజ్లింగ్ ప్రపంచంలో కొనసాగుతున్న గొడవలు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. బజరంగ్ పునియా(Bajrang Punia) తర్వాత.. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) కూడా తన అర్జున్ అవార్డు గౌరవాన్ని తిరిగి ఇచ్చారు. అవార్డులను తిరిగి ఇచ్చేందుకు ఆమె పీఎంవోకు వెళ్తుండగా.. పోలీసులు వినేశ్‌ను అడ్డుకున్నారు. దీంతో వినేష్ తన అర్జున్ అవార్డును విధి మార్గంలో బారికేడ్ల వద్ద వదిలివేశారు. వినేశ్ కంటే ముందు బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వాపస్ చేశాడు.
ఒకరి తర్వాత ఒకరు:
ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికలు డిసెంబర్ 21న జరిగాయి. ఇందులో సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి0 రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత భజరంగ్ పద్మశ్రీని తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు వినేష్ ఆమె ఖేల్ రత్నను తిరిగి ఇచ్చారు. పారా అథ్లెట్ వీరేంద్ర సింగ్ కూడా తన పద్మశ్రీని తిరిగి ఇవ్వడం గురించి ఇప్పటికే ప్రకటన చేశారు. వినేష్ ఫోగట్ 2016 సంవత్సరంలో అర్జున్ అవార్డును, 2020 సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు .
వినేష్ సాధించిన విజయాలు:
--> 2022 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
--> 2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది.
--> 2018లో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది.
--> 2014, 2018 ,2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం
--> ప్రతిష్టాత్మక లారెస్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు.
ఇక వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా అగ్రశ్రేణి ఒలింపియన్లు బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని ఈ ఏడాది ఆరంభం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఒక మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల ఉన్నాయి. ఈ మాజీ WFI చీఫ్‌పై వచ్చిన ఫిర్యాదులలో అతను అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం, వెంబడించడం లాంటి చర్యలకు పాల్పడినట్టు కంప్లైంట్ ఉంది.
Also Read: విజయకాంత్‌ని అలా చూసి బోరుమన్న రజనీకాంత్.. వీడియో వైరల్!
WATCH: