Vinesh Phogat: కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పోటీలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 06 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Vinesh Phogat: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. గత కొన్ని రోజులుగా రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మల్లికార్జున ఖర్గే. కాగా ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీని వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా కలిసిన సంగతి తెలిసిందే. దీంతో వారు త్వరలో కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం దేశ రాజకీయల్లో చక్కర్లు కొట్టింది. #WATCH | Delhi: Vinesh Phogat and Bajrang Punia join the Congress party Party's general secretary KC Venugopal, party leader Pawan Khera, Haryana Congress chief Udai Bhan and AICC in-charge of Haryana, Deepak Babaria present at the joining. pic.twitter.com/BrqEFtJCKn — ANI (@ANI) September 6, 2024 ఎన్నికల బరిలో... మరి కొన్ని రోజుల్లో జమ్మూ కాశ్మీర్ తో సహా హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో హర్యానా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. వీరి చేరికతో కాంగ్రెస్ కు రాజకీయంగా మైలేజ్ పెరగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 90 మంది సభ్యుల శాసనసభకు అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 12, ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరుగుతుంది. Delhi: Bajrang Punia and Vinesh Phogat present on the stage with Congress general secretary KC Venugopal, party leader Pawan Khera, Haryana Congress chief Udai Bhan and AICC in-charge of Haryana, Deepak Babaria. They are about to join the party. pic.twitter.com/sv80HSA3hR — ANI (@ANI) September 6, 2024 #WATCH | Delhi | On joining Congress, Vinesh Phogat says, "I thank Congress party...Kehte hain na ki bure time mein pata lagta hai ki apna kaun hai...When we were being dragged on the road, all parties except BJP were with us. I feel proud that I have joined a party which stands… pic.twitter.com/FIV1FLQeXa — ANI (@ANI) September 6, 2024 #congress-party #vinesh-phogat #bajrang-punia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి