Mendora: అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు.. అసలు ఏమైందంటే

నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండల పరిధిలోని మెండోర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ట్రాక్టర్‌ యాజమాని ఇంటిముందు ఆందోళనకు దిగారు.

Mendora: అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు.. అసలు ఏమైందంటే
New Update

ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో వైద్యుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని భీంగల్‌ మండల పరిధిలోని మెండోర గ్రామానికి చెందిన కాంటం రాజు వృతి రీత్యా ఆర్‌ఎంపీ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. జూలై 30న రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న వైద్యుడిని వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పరిస్ధితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు రాజును హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్‌ఎంపీ వైద్యుడు రాజు ఆగస్టు 31న మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ట్రాక్టర్‌ యాజమాని ఇంటిముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ట్రాక్టర్‌ యాజమాని స్పందించకపోవడంతో ఆయన ఇంటిముందే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు గ్రామస్తులు అంత్యక్రియలను ఆపే ప్రయత్నం చేశారు. గ్రామంలో దహన సంస్కారాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ అంత్యక్రియలు చేస్తే గ్రామానికి కీడు కల్గినట్లు అవుతుందని, అంత్యక్రియలను ఆపాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో మెండోర గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు

#villagers #funeral #owner #rmp #mendora #doctor #death #concern
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe