Thangalaan : విక్రమ్ 'తంగలాన్' కు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..?

చియాన్ విక్రమ్ 'తంగలాన్'సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్‌ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

New Update
Thangalaan : విక్రమ్ 'తంగలాన్' కు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Vikram's Thangalaan Release Date : కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో చియాన్ విక్రమ్ 'తంగలాన్' కూడా ఒకటి. ఇప్పటికే ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విక్రమ్ (Chiyaan Vikram) ఓ ప్రత్యేక గెటప్ లో విభిన్న తరహా పాత్రలో నటిస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, విక్రమ్ బర్త్ డే గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మొదట రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల సమ్మర్ కి షిఫ్ట్ చేసారు. అప్పటికి ఎలక్షన్స్ రావడంతో మరోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

Also Read : అప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు.. షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన మంచు లక్ష్మి!

ఆగస్టు 15 రిలీజ్...

తాజాగా తంగలాన్‌ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, అదే తేదీలో తంగలాన్‌ ఎంట్రీ గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 వాయిదా పడింది. డిసెంబర్‌ 6న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కూడా. దీంతో తంగలాన్ సినిమాకు లైన్‌ క్లియర్‌ అయిందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు