Bollywood: గర్ల్ ఫ్రెండ్ తో బూట్లు నాకించిన స్టార్ హీరో.. దుమ్మెత్తి పోస్తున్న నటులు!

'యానిమల్' మూవీలో రణ్ బీర్ తన బూటు నాకమని ప్రియురాలు త్రిప్తి డిమ్రికి సూచించే సన్నివేశంపై విద్యావేత్త, నటుడు వికాస్ దివ్యకృతి మండిపడ్డారు. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update
Bollywood: గర్ల్ ఫ్రెండ్ తో బూట్లు నాకించిన స్టార్ హీరో.. దుమ్మెత్తి పోస్తున్న నటులు!

Animal: టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా, బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబోలో వచ్చిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బిగ్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు యువతనుంచి విశేష స్పందన లభించినప్పటికీ సమాజం నుంచి మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కథలో పురుషాధిక్యతను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. మహిళలను దారుణంగా కించపరిచారంటూ పలువురు ప్రముఖులు, సినీ నటులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ విద్యావేత్త, '12త్ ఫెయిల్' సినిమా నటుడు వికాస్ దివ్యకృతి యానిమల్ కంటెంట్, పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. 'ఈ సినిమా సమాజాన్ని మరో పదేళ్లు వెనకకు తీసుకెళ్తుంది. రణ్ బీర్, త్రిప్తి డిమ్రీల మధ్య ఉండే షూ సీన్ మరీ ఓవర్ గా ఉంది. గర్ల్ ఫ్రెండ్ ను తన బూటు నాకమని చెప్పడం చాలా దారుణం. ఇలాంటి సీన్స్ తో యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? పరిపక్వత లేని యువత ఇలాంటి సన్నివేశాలు చూసి తమ ప్రియురాల్లను టెస్ట్ చెయ్యరని గ్యారంటీ ఏంటి?' అంటూ ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్‌..!

అమీర్ మాజీ భార్య విమర్శలు..
ఇక సినిమాలో రణ్ బీర్, బాబీ డియోల్ శృంగార సన్నివేశాలు సైతం చాలా కృరంగా ఉన్నాయన్నారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం మూవీ కంటెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా అందరి కామెంట్స్ కు సమాధానం ఇచ్చిన సందీప్ వంగా.. వికాస్ చెప్పిన విషయాలపై ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు