Vijayawada : భారీ వర్షాలు (Heavy Rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ (Vijayawada) లోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (VTPS) నీట మునిగింది. బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో VTPSను వరద ముంచెత్తింది. దీంతో విజయవాడ ప్రాంతమంతా చీకట్లు అలుముకున్నాయి. ఈ పవర్‌ప్లాంట్ సామర్థ్యం 2540 యూనిట్లు ఉండగా.. మొత్తం 8 యూనిట్లలో వినియోగంలో ఉన్నది రెండు మాత్రమే.
అధికారుల తీరుపై ఆగ్రహం ..
అయితే థర్మల్ పవర్ స్టేషన్ మునకపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు (Chandrababu). వెంటనే విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడే మకాం వేశారు. అధికారులతో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ఉదృతి తగ్గేవరకు అక్కడే ఉంటానని చెప్పిన చంద్రబాబు వరద బాధితులకు పూర్తిస్తాయి సహాయక చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. మొదట అక్కడకు చేరకున్న చంద్రబాబు వరద పరిస్థితి పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తానే స్వయంగా సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని చెప్పారు.
Also Read : హైడ్రా దెబ్బకు అడ్వాన్స్‌లు క్యాన్సెల్.. బిల్డర్లకు బిగ్ షాక్!