America : అమెరికాలో విజయవాడ మెడికల్‌ విద్యార్థిని మృతి..కారణం ఏంటంటే!

అమెరికాలో ఉన్నత వైద్య విద్యను చదవడానికి వెళ్లిన విజయవాడకు చెందిన విద్యార్థిని జహీరా నాజ్‌ (22) ప్రమాదవశాత్తు కారులో గ్యాస్‌ లీకై మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

New Update
America : అమెరికాలో విజయవాడ మెడికల్‌ విద్యార్థిని మృతి..కారణం ఏంటంటే!

Medical Student : అమెరికా(America) లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన వైద్య విద్యార్థిని ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ(Vijayawada) ప్రసాదం పాడుకు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ అనే యువతి నగరంలోనే ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేసింది.

ఈ ఏడాది ఆగస్టులో ఉన్నత విద్య ఎంఎస్‌(MS) చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్లింది. బుధవారం ఆమె కారులో వెళ్తుండగా..ఒక్కసారిగా గ్యాస్‌ లీక్‌ అయ్యింది. దీంతో కారు డ్రైవర్‌ తో పాటు జహీరా నాజ్‌(Zaheera Naaz) (22) స్పృహ తప్పి పడిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయాన్ని జహీరా స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆమె మృతి విషయాన్ని విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. పై చదువులు చదవడానికి వెళ్లిన కూతురు ఇలా విగతజీవిగా మారి వస్తుందని అసలు ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

జహీరా మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వ అధికారులు సాయం చేయాలని కోరుతున్నారు. జహీరా మృతి గురించి తెలుసుకున్న ప్రసాదంపాడు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వివరించారు.

Also read : జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.. అచ్చెన్నాయుడు సెటైర్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు