Vijaya santhi: తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని... తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీ తో కలిసి తెలంగాణలో బలపడ్డానికి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని విమర్శించారు. ఇక్కడ టీడీపీ కనుక మళ్ళీ బలపడితే తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమని చెప్పారు.
తెలుగుదేవం పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారని విజయశాంతి విమర్శించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ..పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని అన్నారు విజయశాంతి.
Also Read:CM Revanth Reddy: కడప ఉప ఎన్నిక మీద రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
Telangana: టీడీపీని వ్యాప్తి చేయడానికే చంద్రబాబు తెలంగాణ వచ్చారు-విజయశాంతి
తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలంగాణకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు మీద కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రానికి వచ్చారని అందరూ భావిస్తున్నారు కానీ ఆయన టీడీపీని వ్యాప్తి చేయడానికి వచ్చారని విమర్శించారు.