Vijayasai: త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని విమర్శించారు. మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చిందని. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.

Vijayasai: త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
New Update

Vijayasai Reddy vs Congress: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగింది. వైఎస్ఆర్సిపి తరఫున చర్చలో పాల్గొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్ అని ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చిందన్నారు. ఏపీపై కాంగ్రెస్‌కు (AP Congress) చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా పొందుపరిచేందుకు ఎందుకు విస్మరించారని నిలదీశారు. విభజన చట్టంలో (Bifurcation Law) ప్రత్యేక హోదా చేర్చడంలో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. చట్టంలో చేర్చడం కాంగ్రెస్‌కు చేతగాక, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).

ఇక అంతటితో ఆగలేదు విజయసాయిరెడ్డి.. తెలంగాణ రాజకీయాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని విమర్శించారు. మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చిందని. ఏపీకి ప్రత్యేకహోదా (AP Special Status) ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు విజయసాయిరెడ్డి. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాలన్నారు.

విజయసాయిరెడ్డి ఇంకా ఏం అన్నారంటే?
--> కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు.

--> ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారు.

--> ఏపీ ఇన్చార్జి ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు.

--> ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్‌ కేంద్రాన్ని అనేక సందర్భాల్లో కోరారు.

--> వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే తక్కువ గెలుస్తుందని మమత బెనర్జీ చెబుతున్నారు.

--> కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసింది.

--> కాంగ్రెస్ పార్టీ చెత్తపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం.

--> ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు.

--> ఏపీ లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైంద.

--> కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయింది.

--> ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారు.

--> ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదు.

--> 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది

--> పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు.

--> ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు.

--> ఎన్నికలలో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారు.

సిగ్గుతో తలదించుకోవాలి:
ఏపీ విభజనపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఏకాభిప్రాయం తీసుకురాలేక పోయినందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏపీకి చేసిన మోసాలకు కాంగ్రెస్ కు తగిన శిక్ష పడాలని చెప్పుకొచ్చారు. కుటుంబం వ్యవహారంలో తల దూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ అని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయన్నారు. ఏపీకి చేసిన మోసానికి ఈ శిక్ష పడిందని చెప్పారు విజయసాయిరెడ్డి. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లో గెలవరని.. 2029 నాటికి దేశం కాంగ్రెస్ ముక్త్ భారత్ గా మారుతుందని జోస్యం చెప్పారు విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పాలనాకాలంలో భారతదేశం వెనకడుగు వేసిందని.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశం ఎప్పుడు ముందుకు వెళ్ళలేదన్నారు.

Also Read: అమ్మో బొమ్మ.. చైనా టాయ్స్ కి భారత్ బొమ్మల దెబ్బ..

WATCH:

#ycp #ap-congress #mp-vijayasai-reddy #telangana-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe