Andhra Pradesh : ఘనంగా వైఎస్ఆర్ 75వ జయంతి.. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల.. భావోద్వేగానికి లోనైన విజయమ్మ..! వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్కి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన విజయమ్మ కొడుకు జగన్ ను ముద్దాడి కంటతడి పెట్టుకున్నారు. By Jyoshna Sappogula 08 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YSR 75th Jayanthi : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు ఏపీలో పోటాపోటీ జరుగుతున్నాయి. ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ (Jagan) వైఎస్ఆర్కి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఏపీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) తల్లి విజయమ్మ (Vijayamma), భర్త అనిల్, కూతురు, కొడుకు కోడలుతో కలిసి వైఎస్ కు నివాళులర్పించారు. Also Read: ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు.. రాహుల్ గాంధీ స్పెషల్ వీడియో..! ఈ సందర్భంగా జగన్ ను చూసి భావోద్వేగానికి లోనైన విజయమ్మ ఆయనను ముద్దాడి కంట తడి పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళగిరిలో షర్మిల వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరుకానున్నారు. మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలోనూ ఏపీ వ్యాప్తంగా జయంతి వేడుకలు జరుపుతున్నారు. #ap-chief-sharmila #vijayamma #ys-rajasekhara-reddy #cm-revanth-reddy #ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి