Maharaja : బాలీవుడ్ కు వెళ్తున్న 'మహారాజ'.. విజయ్ సేతుపతి ప్లేస్ లో ఆ స్టార్ హీరో..!

విజయ్ సేతుపతి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'మహారాజ' బాలీవుడ్‌ లో రీమేక్‌ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరో ఆమీర్ ఖాన్‌ ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

New Update
Maharaja : బాలీవుడ్ కు వెళ్తున్న 'మహారాజ'.. విజయ్ సేతుపతి ప్లేస్ లో ఆ స్టార్ హీరో..!

Vijay Sethupathi's Maharaja Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయసేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్ కథానాయికగా నటించగా.. బాయ్స్ ఫేమ్ మణికందన్, అభిరామి, భారతిరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 14న తమిళ్, తెలుగు భాషల్లో థియేటర్స్ లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

బాక్స్ ఆఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్‌ లో రీమేక్‌ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరో ఆమీర్ ఖాన్‌ ఈ సినిమాను రీమేక్‌ చేయనున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఆమిర్‌ ముందుంటారు.

Also Read : నిహారిక కొణిదెల.. ‘కమిటీ కుర్రాళ్ళు’ ట్రైలర్..!

గతంలో ఆయన తండ్రి పాత్రలో నటించిన ‘దంగల్’ సూపర్‌ హిట్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ‘మహారాజ’ను రీమేక్‌ చేస్తే ఇది కూడా ఆయన కెరీర్‌లో నిలిచిపోయే చిత్రమవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఆమీర్ ఖాన్ మళ్ళీ అలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడేమో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు