Maharaja Movie: విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజ.. ఓటీటీ డీల్ వారితోనే..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లేటెస్ట్ ఫిల్మ్ 'మహారాజ'. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మహారాజ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు దక్కించుకుంది.

Maharaja Movie: విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజ.. ఓటీటీ డీల్ వారితోనే..?
New Update

Maharaja Movie: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లేటెస్ట్ మూవీ మహారాజ. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో.. బాయ్స్ ఫేమ్ మణికందన్, అభిరామి, భారతిరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన మహారాజ ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం జూన్ 14న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతిని సెలూన్ షాప్ నడిపే 'మ‌హారాజా' అనే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.

మహారాజ ఓటీటీ అప్డేట్

అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మహారాజ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం కన్నడ, తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఎన్‌వీఆర్‌ సినిమా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. కానీ రిలీజ్‌ డేట్‌ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Maharaja: ఎవరయ్యా ఈ లక్ష్మీ..? సస్పెన్స్ తో చంపేస్తున్న ‘మహారాజా’ ట్రైలర్..!

#maharaja-movie #vijay-sethupathi #maharaja-ott-streaming #mamta-mohandas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe