Vijay Sethupathi: 'హిందీ రుద్దుడు..' రిపోర్టర్‌పై హీరో విజయ్ సేతుపతి ఆగ్రహం!

హిందీ రుద్దుడుకు తమిళనాడు వ్యతిరేకమని.. అంతేకానీ హిందీ భాషకు తాము వ్యతిరేకం కాదని రిపోర్టర్‌కు కౌంటర్‌ వేశాడు తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటించిన 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ కామెంట్స్ చేశాడు.

New Update
Vijay Sethupathi: 'హిందీ రుద్దుడు..' రిపోర్టర్‌పై హీరో విజయ్ సేతుపతి ఆగ్రహం!

దక్షిణాది ప్రజలు.. ముఖ్యంగా తమిళలు హిందీ భాష రుద్దుడును అసలు సహించరు. హిందీ వ్యతిరేక ఉద్యమాలు దక్షిణాది కేంద్రంగా ఎన్నో జరిగాయి. ఇక ఇటీవలి కాలంలోనూ ఈ లాంగ్వేజ్‌ వార్‌ జరిగింది. బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ తమిళల టార్గెట్‌గా 'అందరూ హిందీ నేర్చుకోవాల్సిందే'నని చెప్పడం వివాదానికి కారణం అయ్యింది. ఇక ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశాడు.


మేటర్ తెలుసుకో ముందు:
విజయ్ సేతుపతి(Vijay Sethupathi), కత్రినా కైఫ్(Katrina Kaif) జంటగా నటించిన చిత్రం 'మెర్రీ క్రిస్మస్'. ఈ సినిమా ప్రమోషన్ లో ఇద్దరు స్టార్స్ చెన్నైలో వాలిపోయారు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా జరిగిన ఓ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చిత్ర కథానాయకుడు విజయ్ సేతుపతిని 'హిందీని బలవంతంగా రుద్దడం అంశం' గురించి ప్రశ్నించగా అతను ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ఎప్పుడూ హిందీకి నో చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. హిందీ రుద్దుడుకు తమిళనాడు వ్యతిరేకమని.. అంతేకాని భాషకు తాము వ్యతిరేకం కాదన్న విషయం తెలుసుకోవాలన్నరు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'మెర్రీ క్రిస్మస్' జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ-హిందీ ద్విభాషా చిత్రం. రెండు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, హిందీలో రెండు డిఫరెంట్ ట్రైలర్స్ వచ్చాయి. 'మెర్రీ క్రిస్మస్' 2024 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి.

Also Read: రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్‌ పోస్ట్.. అంబానీ మావకు ఇచ్చి పడేశాడుగా!
WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు