Vijay Devarakonda : రోహిత్‌ శర్మ పై విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!

క్రికెటర్ రోహిత్ శర్మ పై విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చాలా భిన్నమైన క్రికెటర్‌ అంటూ రోహిత్‌ ని ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనతో ఓ సినిమా తీయాలని చెప్పాడు. ఆయనతో హిట్‌ మ్యాన్‌ అనే సినిమా తీస్తే కరెక్ట్‌ గా సెట్‌ అవుతుందని చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda : రోహిత్‌ శర్మ పై విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!
New Update

Vijay - Rohit : విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) ఏప్రిల్ మొదటి వారంలో ఫ్యామిలీ స్టార్‌(Family Star) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాలో విజయ్‌ కి జంటగా మృణాల్‌ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై మంచి టాక్‌ ను సొంతం చేసుకున్నాయి.

ప్రస్తుతం విజయ్‌ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ స్టార్ స్పోర్ట్స్‌ స్టూడియోకి వెళ్లిన విజయ్‌ సందడి చేశాడు. ఈ క్రమంలో విజయ్‌ తనకు క్రికెట్(Cricket) తో ఉన్న అనుబంధం, తనకిష్టమైన క్రికెటర్స్‌, ఐపీఎల్‌, ఇంటర్నేషనల్‌ క్రికెట్ గురించి ఇలా అనేక విషయాలను వెల్లడించాడు.

ఈ క్రమంలో క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పై విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చాలా భిన్నమైన క్రికెటర్‌ అంటూ రోహిత్‌ ని ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనతో ఓ సినిమా తీయాలని చెప్పాడు. రోహిత్‌ నటించిన ఓ యాడ్‌ లో డాన్స్ చేయమని చెబుతున్న తీరు మాస్‌ గా ఉందని విజయ్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ చూపించిన మరో యాడ్ లో రోహిత్‌ ఎంతో కష్టమైన వర్కౌట్లను రోహిత్ శర్మ చాలా ఈజీగా చేసేస్తున్నాడు.

వాటిని చూసిన నాకు మెంటల్‌ ఎక్కిపోయిందని విజయ్‌ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ చాలా ఫిట్‌ గా ఉంటాడని.. అది సాధారణ విషయం కాదని విజయ్‌ పేర్కొన్నాడు. ఆయనకు సరిపోయే టైటిల్ ఇంకా రాలేదని విజయ్‌ చెప్పుకొచ్చాడు. ఆయన హిట్‌ మ్యాన్‌ అనే సినిమా తీస్తే కరెక్ట్‌ గా సెట్‌ అవుతుందని చెప్పుకొచ్చాడు. రోహిత్‌ కు కొంచెం వాట్ లగా దేంగే టైమ్‌, యాటిట్యూడ్‌ ఉంటుందని విజయ్‌ పేర్కొన్నాడు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ అన్న వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో రోహిత్‌ శర్మ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read : టికెట్ ఇవ్వలేదని ఎంపీ ఆత్మహత్యయత్నం.. చికిత్స పొందుతూ మృతి!

#cricket #rohit-sharma #vijay-devarakonda #family-star #mrunal-thakur
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe