Vijay Devarakonda: మళ్లీ దొరికిపోయిన విజయ్‌-రష్మిక.. ఇదిగో ప్రూఫ్‌!

రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో రిలేషన్‌ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియా లో ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి దొరికిపోయారు. వీరు దుబాయ్ లో ఎంజాయ్‌ చేస్తున్నట్లు వారు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తే తెలుస్తుంది.

New Update
Vijay Devarakonda: మళ్లీ దొరికిపోయిన విజయ్‌-రష్మిక.. ఇదిగో ప్రూఫ్‌!

Vijay Devarakonda - Rashmika Mandanna: "విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు".. కానీ ఇప్పుడు విజయ్‌ దుబాయ్‌ ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్ విడుదల పెట్టుకొని దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? "రష్మిక బర్త్‌డే ఉంది" అందుకే అనే టాక్‌ వినిపిస్తుంది.

రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో రిలేషన్‌ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియా లో ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటిపై ఈ జంట ఇప్పటివరకూ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ ఇలా అడిగిన ప్రతిసారి మాత్రం నవ్వుతూ ఉంటారు. కానీ చాలా సార్లు వీళ్లిద్దరూ కలిసి వెకేషన్‌కి వెళ్లారని తెలిసిందే. వీళ్లు సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలను చూసి ఇద్దరూ ఒకే చోట ఉన్నారంటూ ఫ్యాన్స్ ప్రూఫ్స్‌తో సహా బయటపెడతారు. ఇక తాజాగా మరోసారి ఇద్దరు అలాగే దొరికిపోయారు.

ప్రస్తుతం రష్మిక -విజయ్ దేవరకొండ ఇద్దరూ దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రష్మిక తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.. అలానే ఒక నెమలి ఫొటోను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ అంటూ రష్మిక స్టోరీ పెట్టింది. ఇక కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి చెప్పుకుంటూ వచ్చాడు.

అయితే బ్యాక్ గ్రౌండ్‌లో గమనిస్తే అదే నెమలి మళ్లీ కనిపించింది. ఇంకేముంది ఈ రెండు స్టోరీలను క్లబ్ చేసి వీళ్లిద్దరూ సేమ్ ప్లే‌స్‌లో ఉన్నారంటూ ఫ్యాన్స్ కన్ఫార్మ్‌ చేసేశారు. ఏప్రిల్ 5న రష్మిక బర్త్‌డే కావడంతో దుబాయ్‌లో పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారట. అందుకే రష్మిక-విజయ్ దుబాయ్ వెళ్లినట్లు టాక్.

Also read: 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం.. జాగ్రత్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు