Movies: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది.. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరుశరాం కలిసి చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. లుంగీ కట్టుతో...వంట చేస్తూ కనిపిస్తున్న విజయ్ ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్‌తో వచ్చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. By Manogna alamuru 28 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Family Star: డైరెక్టర్ పరుశరాం ఫ్యామిలీ స్టార్ సినిమాను అనౌన్స్ చేయగానే గీతగోవిందం పార్ట్ టూ తీస్తున్నాడేమో అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే విజయ్ లుక్, పాత్ర అన్నీ అలానే అనిపించాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌లు ఆ అనుమానాలను మరింత పెచాయి. కానీ ఈ రోజు విడుదల చేసిన ఇది పక్కా ఫ్యామిలీ మూవీ అని తేలిపోయింది. గీత గోవిందానికీ...ఫ్యామిలీ స్టార్‌కూ సంబంధం లేదని కూడా అనిపిస్తోంది. కానీ ఆ సినిమాకు , ఈసినిమాకు పోలికలు మాత్రం చాలనే కనిపిస్తున్నాయి. అందులో విజయ్...రష్మిక వెంటపడినట్టే...ఇందులో కూడా మృణాల్ వెంటపడటం, డైలాగులు లాంటి వన్నీ గీతగోవిందాన్నే గుర్తు చేస్తున్నాయి. డైరెక్టర్ పరుశురాం ఫ్యామిలీ కథకే...కామెడీ టచ్ ఇచ్చి ఫ్యామిలీ స్టార్ తీశారని తెలుస్తోంది. అలాగే విజయ్ లోని యాక్షన్ స్టార్‌ని కూడా హైలైట్ చేసాడు. దాంతో పాటూ విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండేటట్టు ఉన్నాయి. నేనైతే మీకు ఫుల్లుగా పడిపోయా అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పిన రొమాంటిక్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. మిడిల్ క్లాస్ ఆలోచనలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. విజయ్ దేవరకొండ డైలాగులు, లుక్ కూడా ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ మూవీని ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్‌ను విడుదల చేశారు. ఇందులో రష్మిక అతిథి పాత్రలో కినిపంచబోతోంది. ఆమెతో పాటూ దివ్యాంశ కౌశిక్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. Also Read:Supreme Court : న్యాయవ్యవస్థకు ముప్పు..సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ #vijay-devarakonda #movies #trailer #family-star మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి