Vijay Devarakonda Block Buster Movies : టాలీవుడ్(Tollywood) లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు.
రీసెంట్ టైమ్స్ లో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు సక్సెస్ అవ్వకపోయినా.. రౌడీ హీరోకి ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తన కెరీర్లో ఏకంగా 4 బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ సినిమాలు విజయ్ చేసుంటే అతని క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకునేది. ఇంతకీ ఆ రౌడీ హీరో మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బ్లాస్టర్ సినిమాలేంటి?
Also Read : భారత క్రికెట్ జట్టు కోచ్ రేస్ లో టాలీవుడ్ హీరో.. కానీ?
1. భీష్మ : నితిన్ కెరీర్ కి ఈ మూవీ బాగా హెల్ప్ అయింది. నిజానికి ఈ సినిమా కథను డైరెక్టర్ వెంకీ కుడుముల విజయ్ దేవరకొండకు చెప్పాడట. కానీ పలు అనివార్య కారణాల వల్ల విజయ్ రిజెక్ట్ చేశాడు.
2. ఇస్మార్ట్ శంకర్ : పూరీ జగన్నాథ్ - రామ్ కాంబోలో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కథ ఫస్ట్ విజయ్ దేవరకొండ వద్దకే వెళ్ళింది. అయితే సినిమాలోని డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ విషయంలో విజయ్ కి కొన్ని అనుమానాలు ఉండటంతో ఈ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట.
3. RX 100 : యూత్ ని విపరీతంగా అలరించిన ఈ సినిమాతో హీరోగా కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చించి. మొదట ఈ సినిమా కోసం డైరెక్టర్ అజయ్ భూపతి శర్వానంద్ ని అనుకోని కథ వినిపించినా, సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉండటం వల్ల శర్వా వద్దనుకున్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండను సంప్రదిస్తే అప్పటీకే తాను చేసిన అర్జున్ రెడ్డి తరహాలోనే RX 100 కథ ఉందని రిజెక్ట్ చేశాడు.
4. ఉప్పెన : 2021 లో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన(Uppena) సినిమాకి ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండనే. ఈ విషయం చాలామందికి తెలియదు. బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండను ఊహించుకునే ఉప్పెన స్టోరీ డెవలప్ చేసుకున్నారు.కానీ అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడంతో ఈ కథ అతనికి సూట్ అవ్వదని భావించి వైష్ణవ్ తేజ్ ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు.