Medigadda: మేడిగడ్డ కుంగుబాటు మానవ తప్పిదమే.. రిపోర్టులో కీలక విషయాలు

మేడిగడ్డ కుంగుబాటు వరదల వల్ల కాలేదని.. మానవ తప్పిదం వల్లే డ్యామెజ్ జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు తేల్చి చెప్పారు. కాంక్రీట్, స్టీల్‌లో నాణ్యత లోపం ఉన్నట్లు గుర్తించారు. త్వరలో పంప్‌ హౌజ్‌లపై కూడా విచారణ జరుపుతామని పేర్కొన్నారు.

Medigadda: మేడిగడ్డ కుంగుబాటు మానవ తప్పిదమే.. రిపోర్టులో కీలక విషయాలు
New Update

మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు తాజాగా ఓ నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదలకలో ఏముందంటే.. 'వరదలతో డ్యామెజ్ జరగడం లేదు.. మానవ తప్పిదం వల్లే మేడిగడ్డకు డ్యామెజ్‌ జరిగింది. కాంక్రీట్, స్టీల్‌లో నాణ్యత లోపం ఉంది. 2019లోనే మేడిగడ్డకు డ్యామెజ్‌ అయ్యింది. ఇది ప్రారంభం అయ్యాక మొదటి వరదకే పగుళ్లు బయటపడ్డాయి. పగుళ్లను రిపేర్ చేయాలంటూ వర్షకాలానికి 10 రోజుల ముందే ఎల్‌ ఎండ్ టీకి విజిలెన్స్‌ లేఖ రాసింది.

Also Read: రేవంత్ సర్కార్ ఉంటదో..ఉండదో..నాకైతే డౌటే..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రాజెక్టు రికార్డులు మాయమయ్యాయి

వర్షకాలంలో మెయింటినెన్స్ రిపేర్స్ చేయడం సాధ్యం కాదని ఎల్‌ అండ్ టీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత వచ్చిన వరదలకి 11 నుంచి 20 పియర్స్‌ వరకు భారీ పగుళ్లు వచ్చాయి. పగుళ్లను అధికారులు గుర్తించకపోవండతో డ్యామ్ ప్రమాదంలో పడింది. ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డులు మాయమయ్యాయి. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవు. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు వచ్చాయి. మేడిగడ్డ డిజైన్‌కు, నిర్మాణానికి చాలా తేడాలు ఉన్నాయని' నివేదికలో తెలిపింది.

శాటిలైట్‌ డేటా ?

ప్రాజెక్టు పిల్లర్లు, బ్లాక్స్‌లో నాణ్యతపై కూడా విజిలెన్స్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. అప్పటివరకు మేడిగడ్డపైనే విచారణ జరిగిందని.. త్వరలో పంప్‌ హౌజ్‌లపై కూడా విచారణ జరుపుతాం. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్‌ డెటాను విజిలెన్స్‌ అధికారులు అడిగారు. అయితే మరో రెండు, మూడు రోజుల్లో అధికారుల వద్దకు శాటిలైట్‌ డేటా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: మగాళ్లకూ మంచిరోజులు వచ్చేశాయ్..పురుషులకోసం ప్రత్యేక బస్సులు…కండీషన్స్ అప్లయ్..!!

#telugu-news #inspections-by-vigilance-officers #medigadda-barrage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe