/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-8-7-jpg.webp)
Vidadala Rajini Kidnapped: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కిడ్నాప్ ఇష్యూ కలకలం రేపింది. విడదల రజిని పేరుమీద ఒక మహిళతో బలవంతంగా నామినేషన్ వేయించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తమ ఇంటి మహిళను కిడ్నాప్ చేశారంటూ బాధితురాలి బంధువులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు.
దీంతో వెంటనే రంగలోకి దిగిన పోలీసులు సదరు మహిళను దొరకబట్టి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే తాను స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు సిద్దమైనట్లు ఆమె వెల్లడించిండంతో ముగిసిన కిడ్నాప్ వివాదం ముగిసింది. దీంతో నగరపాలెం పిఎస్ వద్ద నుంచి బంధువులు ఇంటికి తీసుకెళ్లినట్లు
పోలీస్ అధికారులు తెలిపారు.