సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించినట్లు సమచారం. రామ్మూర్తి నాయుడు కొడుకు హీరో నారా రోహిత్. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!
అనారోగ్య కారణాల వల్ల దూరంగా..
1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు 1952లో నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు జన్మించాడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు నటుడు నారా రోహిత్ కాగా, మరొకరు గిరీష్. ఇటీవల నారా రోహిత్‌కి హీరోయిన్ శిరీషాతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా
ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కానీ సోదరుడికి సీరియస్ అని తెలిసిన వెంటనే హైదరాబాద్‌కి బయలు దేరారు. మంత్రి లోకేశ్ కూడా కార్యక్రమాలు అన్నింటిని రద్దు చేసుకుని వెంటనే హైదరాబాద్‌కి బయలు దేరారు. హీరో బాలకృష్ణ కూడా వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి బయలు దేరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు
రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలను వారి స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నట్లు సమాచారం. రేపు అనగా ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!