ఈ దుస్తులు ధరించి.. నవరాత్రుల పూజ చేస్తే అంతా మంచే!

దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులు ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను ధరించి పూజలు నిర్వహిస్తారు. ఏడవ రోజు ఆశ్వయుజ సప్తమి నాడు రాయల్ బ్లూ కలర్‌‌లో ఉండే దుస్తులను ధరించి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

FotoJet (9)
New Update

అక్టోబర్ 3 నుంచి నవరాత్రులు వేడుకలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలను దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ దేవీ నవరాత్రులను జరుపుకుంటారు. అయితే నవరాత్రుల్లో కొందరు రంగు రంగుల దుస్తులు ధరిస్తారు. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఎలా దర్శనమిస్తారో.. అలాగే ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను ధరించి దేవీని పూజించాలని పండితులు చెబుతారు. నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏ రంగు దుస్తులతో అమ్మవారిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: ఎల్బీ స్టేడియంలో నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు

ప్రశాంతతకు చిహ్నం..

తొమ్మిది రోజుల పాటు జరుపుకునే నవరాత్రి వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించాలి. రోజుకొక అవతారం బట్టి ఒక్కో రంగు దుస్తులు ధరించాలి. దుర్గాదేవి నవరాత్రుల్లో ఈ రోజు ఏడవ రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు కాత్యాయని రూపంలో ఉండే అమ్మవారిని పూజిస్తారు. ఈమె ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నంగా చెబుతారు. ఈ రోజు రాయల్ బ్లూ కలర్‌లో ఉండే దుస్తులను ధరించి అమ్మవారిని పూజిస్తే ప్రశాంతత ఉంటుందని భక్తులు నమ్ముతారు. 

ఇది కూడా చూడండి: ఫెస్టివల్ సేల్.. ఒప్పో ఫోన్లపై ఆఫర్ల జాతర, డోంట్ మిస్!

నవరాత్రుల్లో ఎనిమిదో రోజు మహాగౌరీ అమ్మవారిని పూజిస్తారు. ప్రేమ, కరుణ, దయను సూచించే అమ్మవారిని పూజించేటప్పుడు గులాబీ రంగు దుస్తు్లను ధరించాలని పండితులు చెబుతున్నారు. ఇకపోతే చివరి రోజు తొమ్మిదో రోజు సిద్ధిధాత్రి అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజున  ఊదా రంగు దుస్తులు ధరించి దుర్గాదేవిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

గమనిక: ఈ సమాచారం గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ నియమాలు పాటించే ముందు పండితులను సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: వణుకుతున్న అమెరికా.. హరికెన్ మిల్టన్‌తో ముప్పు

#light-color-dress #dussehra #devi-navaratri-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe