ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయడం వల్ల రోజంతా సంతోషంగా, యాక్టివ్‌గా ఉంటారు. అందరూ పొద్దున్న లేచిన వెంటనే మొబైల్ చూడటం స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల రోజంతా ఏదో చిరాకు, కోపంగా, ఒక్క పని కూడా సరిగ్గా జరగదు. అదే ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేస్తే రోజంతా సంతోషంగా ఉంటారు.
ఇది కూడా చూడండి: పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే?
వ్యాయామం
ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి.. మొబైల్ వంటివి చూడటం కాకుండా వ్యాయామం చేయాలి. రోజూ కనీసం అరగంట పాటు వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా అలసట, నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉంటారు.
సూర్యరశ్మి
పొద్దున సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో కూడా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చూడండి: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు
ధ్యానం
ఎక్కువగా వాకింగ్, రన్నింగ్ వంటివి చేయలేని వాళ్లు మెడిటేషన్, యోగా వంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.
టిఫిన్ మిస్ కావద్దు
రోజులో ఏ పూట అయిన ఫుడ్ తినడం మానేస్తే పర్లేదు. కానీ ఉదయం పూట టిఫిన్ మాత్రం అసలు మానకూడదు. ఉదయం పోషకాలు ఉండే పదార్థాలను తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
ఇది కూడా చూడండి: నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా