Sweet Potato: స్వీట్ పొటాటో సూపర్ ఫుడ్..! చిలగడదుంపను పోషకాల గని అని కూడా పిలుస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు అందుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిలగడదుంపలో విటమిన్ సి కూడా ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు..
చిలగడదుంపలో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్.. గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు పొటాషియం.. ఒత్తిడిని తగ్గించడానికి, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడే మెగ్నీషియం ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి, అది అరగడానికి సమయం పడుతుంది. అందుకే గ్యాస్ సమస్యలు ఉన్నవారు.. వృద్దాప్యంలో ఉన్నవారు ఇది ఎంత తక్కువ తింటే అంత మంచిది.