తన కోపమే తన శత్రువు.. అన్నారు ఆనాటి పెద్దలు. ఆవేశం హానికరం అన్నారు ఈనాటి మిత్రులు. ఆవేశం హద్దుల్లో లేకపోతే అనర్థాలు ఏర్పడతాయని నేటి తరం భావిస్తోంది. కోపాన్ని పెంచుకుంటే... ఆరోగ్య నష్టం జరుగుతుందని అన్ని తరాలకూ హెచ్చరిస్తోంది. ఆవేశం కట్టలు తెంచుకుంటే... అవకాశాలు కోల్పోవడమే కాకుండా... తీవ్ర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Curry Leaves: కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?
ఆవేశపడితే.. ఆరోగ్యం నాశనం..
చిన్న చిన్న విషయాలకు ఆవేశపడితే... మీ ఆరోగ్యాన్ని మీరు పాడుచేసుకున్నట్టే అవుతుంది. చీటికీ మాటికీ వచ్చే కోపం ఎదుటివారికి నష్టం కలిగిస్తోంది. అంతేకాదు..కోపం.. మీకెంతో చేటు తెస్తోంది. కోపం కారణంగా కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడమే కాకుండా... మెదడులోని రక్తనాళాలు కుంగిపోతాయి.
ఇది కూడా చదవండి: Custard Apple: ఈ సీజనల్ ఫ్రూట్ అతిగా తిన్నారో.. అంతే సంగతి ఇక!