Young MP: న్యూజిలాండ్ (New Zealand) పార్లమెంట్ లోని సభ్యులందరి చూపు నేడు ఆ 21 సంవత్సరాల యువతి మీదే ఉంది. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఉన్న సభలో తన మాతృభాషకోసం పార్లమెంట్ లో 21 ఏళ్ల డైనమిక్ ఎంపీ మైపి క్లార్క్(Maipi-Clarke) చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీ కోసం నేను చచ్చి పోతాను..
మీ కోసం నేను చచ్చి పోతాను..ఈ నేల కోసం..ఈ చెట్ల కోసం..ఈ ప్రకృతి కోసం..నా మాతృ భాష కోసం.. ఈ సభలో నేడు నేను ఉంటాను..రేపు ఉండకపోవచ్చు..ఇవాళ నేను బతికున్నాను..రేపు ఈ భూమి పై ఉండకపోవచ్చు...నా భాష ఉంటుంది...నా నేల ఉంటుంది..నా చెట్లు ఉంటాయి..నా జాతి ఉంటుంది...ఈ ప్రకృతి ఉంటుంది...ఈ మాటలను మైపి క్లార్క్ తన మాతృభాషలో చెబుతూ అందర్నీ నోరెళ్లబెట్టేలా చేసింది.
కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్న మైపి తన మాతృభాషలో ..స్థానిక జాతులు మాట్లాడే రీతిలో ప్రసంగించింది. రకరకాల హావభావాలను ప్రదర్శిస్తూ..చాలా ఎమోషనల్ గా తన ప్రసంగాన్ని కొనసాగించింది. ఎంతో ఉద్విగ్నంగా సాగిన ఈ ప్రసంగంతో సభలో ఉన్న వారందరి చేత చప్పట్లు కొట్టించింది.
న్యూజిలాండ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జాతి ఆధారంగా కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్లుగా విధానాలను మార్చి అమలు చేయాల్సిన అవసరం ఉందని..ఇందుకు గానూ 12 చట్టాలకు సవరణ చేయాల్సి ఉంటుందని న్యూజిలాండ్ పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చింది.
అయితే ఆ బిల్లును మావోరీ ప్రాంతానికి చెందిన ఎంపీ తీవ్రంగా వ్యతిరేకించింది. 180 ఏళ్ల క్రితం మావోరీ అనే ప్రాంతంలోని ఓ జాతికి సంబంధించి..అంటే నిధుల కేటాయింపు, విద్య, వైద్యం,కనీస అవసరాలు , ప్రభుత్వ విధానాల్లో ప్రత్యేక కోటా ఇలాంటివి ఉన్నాయి. ఈ 180 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు కూడా వచ్చాయి.
కులం జాతి ఆధారంగా ప్రత్యేక రిజర్వేషన్లు కాకుండా..ప్రజల అవసరాలు..వారి ఆర్థిక అవసరాల ఆధారంగా నిర్ణయాలు ఉండాలంటూ కొత్త బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది న్యూజిలాండ్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ బిల్లును ఎంపీ మైపి క్లార్క్ వ్యతిరేకిస్తుంది. ఆమె ప్రసంగించిన తీరు, పలికించిన హావాభావాలు కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలోనే ...170 ఏళ్ల తరువాత అత్యంత పిన్న వయసులోనే ఎంపీగా గెలిచి రికార్డు కూడా మైపీ పేరుతో ఉంది.
Also read: అయోధ్య రామయ్య వద్దకు తిరుమల శ్రీవారి లడ్డూలు!