TTD: అయోధ్య రామయ్య వద్దకు తిరుమల శ్రీవారి లడ్డూలు! జనవరి 22న అయోధ్యలో జరిగే మహత్తర రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి, తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున లక్ష లడ్డూలను కానుకగా పంపుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుందని ఆయన వివరించారు. By Bhavana 05 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ayodhya: యావత్ దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహోన్నత కార్యం మరి కొద్ది రోజుల్లోనే జరగనుంది. అయోధ్య (Ayodhya) లో ఈ నెల 22న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం, అటు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లను ఘనంగా మొదలు పెట్టింది. ఈ మహోన్నత కార్యానికి తిరుమల శ్రీవారి (TTD) తరుఫు నుంచి కానుక వెళ్లబోతుంది. ఆ కానుక ఏంటో తెలుసా..తిరుమల స్వామి వారి లక్ష లడ్డూలు అయోధ్యకు పంపనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) తెలిపారు. అయోధ్య రామయ్య చెంతకు పంపే ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుందని ఆయన వివరించారు. హైందవ ధర్మ అభివృద్దికి టీటీడీ కట్టుబడి ఉంది.. శుక్రవారం నాడు తిరుమల(Tirumala) అన్నమయ్య భవన్ (Annamayya Bhavan) లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ అభివృద్దికి టీటీడీ కట్టుబడి ఉందని వివరించారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో వచ్చే నెల 3 నుంచి 5 వ తేదీ వరకు ధార్మిక సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు దేశ నలుమూల నుంచి కూడా ప్రముఖ ధార్మిక సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని ధర్మారెడ్డి వెల్లడించారు. ఇక తిరుమలలో నిర్వహిస్తున్న ధనుర్మాస కార్యక్రమాల గురించి కూడా వివరించారు. జనవరి 15 సోమవారం నాడు టీటీడీ కార్యాలయం వద్ద గోదా కల్యాణం నిర్వహిస్తున్నామని, మంగళవారం కనుమ నాడు స్వామి వారి పార్వేట ఉత్సవం జరుపుతున్నట్లు పేర్కొన్నారు. జాగ్రత్తగా ఉండండి.. ఇక పోతే శ్రీవారి భక్తులు టీటీడీ పేరుతో ఏర్పాటవుతున్న నకిలీ వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దర్శనాలు, వసతి, ఆర్జిత సేవలు, విరాళాల కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని సూచించారు. Also read: విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుతో ఎంట్రీ ఇవ్వబోతున్న మంచు వారి మూడో తరం! #january-22 #ayodhya #ramamandir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి