Kerala: కాంగ్రెస్‌ నేత ఇంట్లో చేతబడి వస్తువులు!

కేరళ ప్రదేశ్‌ కమిటీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కన్నూర్‌ ఎంపీ సుధాకరన్‌ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

New Update
Kerala: కాంగ్రెస్‌ నేత ఇంట్లో చేతబడి వస్తువులు!

Kerala:  కేరళ ప్రదేశ్‌ కమిటీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కన్నూర్‌ ఎంపీ సుధాకరన్‌ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. వీడియోలో కన్నూర్ లోని సుధాకరన్‌ నివాసంలో కొందరు వ్యక్తులు చేతబడికి సంబంధించిన పాతిపెట్టిన వస్తువులను బయటకు తీసుకుని వస్తున్నారు.

అయితే ఈ వీడియో పై కేపీసీస అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఇది పాత వీడియో అని , ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పాతిపెట్టిన వస్తువులను బయటకు తీసినప్పుడు మీరు సంఘటనా స్థలంలో ఉన్నారా అని సుధాకరన్‌ ప్రశ్నించగా..మీరు ఉన్నితాన్‌ నుంచి పూర్తి సమాచారం పొందండి ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేదే లేదు. ఈ విషయాల గురించి తాను కూడా విన్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ వీడియోలో మూడో వ్యక్తి కూడా కనిపించాడు. ఆ వ్యక్తి జ్యోతిష్కుడనే ఊహాగానాలు బయటకు వస్తున్నాయి.వీటిని చేతబడి కోసం వినియోగిస్తున్నట్లు ఆ వీడియోలో కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also read: ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌!

Advertisment
తాజా కథనాలు