Animal: యానిమల్ పార్క్‌లో మరో క్రేజీ హీరో?

యానిమల్ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చింది. పాజిటివ్ టాక్‌తో నెగటివ్ టాక్ కూడా సమానంగా రావడం ఆ సినిమాకు ప్లస్ అయింది. దీని సీక్వెల్ యానిమల్ పార్క్‌లో అంతకంటే క్రూరమైన పాత్రలు గట్టిగానే ఉండనున్నాయి. ఇందులో ఒక పాత్ర బాలీవుడ్ క్రేజీ హీరో నటిస్తాడని తెలుస్తోంది.

Animal: యానిమల్ పార్క్‌లో మరో క్రేజీ హీరో?
New Update

Vicky Kaushal in Animal Park: బాలీవుడ్‌లో వెరైటీ పాత్రలకు పెట్టింది పేరు విక్కీ కౌశల్. చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్కీ చాలా తొందరగానే ఎదిగాడు. ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి పెద్ద హీరోగా నిలబడ్డాడు. కత్రినీ కైఫ్‌ను పెళ్ళి చేసుకున్నాక విక్కీ కౌశల్ మరింత ఫేమస్ అయిపోయాడు. విక్కీ తాను ఎంచుకునే పాత్రలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. రెగ్యులర్ హీరో పాత్రలను పెద్దగా చేయడు. తన రోల్‌కు ఇంపార్టెన్స్ ఉంటే మూవీలో ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాడు కూడా. ఇప్పుడు యానిమల్ పార్క్‌లో కూడా ఇలాంటి పాత్రలనే విక్కీ కౌశల్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది.

Also Read:Lasya Nanditha Death: ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో ట్విస్ట్..టిప్పర్ డ్రైవర్ అరెస్ట్

సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా తెరపైకి వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఈ సినిమా ప్రకంపనలు సృష్టించింది. గతంలో ఎప్పుడో లేనంత హై వోల్టేజ్ యాక్షన్ ను దర్శకుడు ఈ సినిమాలో హైలెట్ చేశాడు. ఇందులో ప్రతీ పాత్ర బాగా ఎలివేట్ అయింది. బాబీ డియోల్ (Bobby Deol) క్యారెక్టర్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక యానిమల్ పార్క్‌లో కూడా దీనికి రెండింతలు క్రూరమైన పాత్రలు ఉంటాయని దర్శకుడు సందీప్ వంగా ముందే చెప్పేశాడు. యానిమల్ సినిమా ఎండింగ్‌లో రణబీర్ పాత్రే ఇందుకు ఉదాహరణ.

రెండో రణబీర్‌కు ఆపోజిట్‌గా ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. వాటిల్లో బాగా వైరల్ అవుతున్న నేరు విక్కీ కౌశల్. కౌశల్ మరొక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సందీప్ ఇప్పటికే విక్కీ కౌశల్ ని కూడా సంప్రదించి స్టోరీ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్ కోసం స్పిరిట్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. దాని తర్వాతనే యానిమల్ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ముందుగానే క్యారెక్టర్స్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి అని సందీప్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక విక్కీ కౌశల్‌ కూడా యానిమల్ పార్క్‌లో పాత్రకు ఓకే చెప్పాడని టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

#vicky-kaushal #animal-park #ranbir-kapoor #sandepp-reddy-vanga
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి