Venkatesh New Movie : వెంకటేష్.. అనిల్ రావిపూడి కాంబినేషన్.. హీరోయిన్ గా గుంటూరు కారం బ్యూటీ!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో గుంటూరు కారం సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపిస్తుందని టాలీవుడ్ టాక్. 

Venkatesh New Movie : వెంకటేష్.. అనిల్ రావిపూడి కాంబినేషన్.. హీరోయిన్ గా గుంటూరు కారం బ్యూటీ!
New Update

Venkatesh New Movie : విక్టరీ వెంకటేష్(Victory Venkatesh).. టాలీవుడ్ అభిమానుల(Tollywood Fans) హృదయాల్లో స్పెషల్ ప్లేస్ సాధించుకున్న నటుడు. సాధ్యమైనంత వరకూ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చారు. ఇటీవల తన 75వ సినిమా సైంధవ్(Saindhav) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విపరీతమైన బజ్ తో సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరో వైవిధ్యమైన పాత్రతో వెంకటేష్ కనిపించారు. అయితే, సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇప్పుడు తన 76వ సినిమా కోసం రెడీ అయిపోతున్నారు వెంకటేష్. ఈసారి తన లక్కీ డైరక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో కలిసి మళ్ళీ సందడి చేయడానికి వచ్చేస్తున్నారు. అనిల్ రావిపూడి గతంలో వెంకటేష్ తో వెండితెరపై ఎలాంటి ఫన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ కామెడీతో ప్రేక్షకులను అలరించాయి అనిల్-వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. 

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా(Venkatesh New Movie) మంచి కామెడీతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్(Family Action Entertainer) అని తెలుస్తోంది. ఈ సినిమాపై అధికారికంగా త్వరలోనే ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తోంది. ఈ మూవీ కోసం వెంకటేష్ తో గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్ గా జతకట్టబోతోందని చెబుతున్నారు. గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాలో తన అందం.. అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన మీనాక్షి.. ఇప్పుడు వెంకటేష్ సరసన కనిపిస్తుందని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాలో మీనాక్షి మావా పాట ఎంత హిట్ అయిందో తెలుసు. మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి స్టెప్స్ కి చాలామంది ఫిదా అయిపోయారు. ఇప్పుడు అనిల్ రావిపూడి.. వెంకటేష్ జతగా ఆమెను ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తుంది. 

Also Read : రణ్‍బీర్, సాయిపల్లవి ‘రామాయణం’ నుంచి బిగ్ అప్ డేట్!

ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం.. సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీకల్ టీమ్ సెట్ చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్(Venkatesh New Movie) అనగానే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. వాటికి ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని.. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా వచ్చిందనీ టాలీవుడ్ టాక్. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని దిల్  రాజు ఎప్పుడో ప్రకటించారు. సో.. వచ్చే సంక్రాంతి పండక్కి.. వెంకటేష్-మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో అనిల్ రావిపూడి త్వరలోనే ఫన్ పంచుతారన్నమాట.

మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాలో ఈ పాట ఒకసారి చూసేయండి :

 

#meenakshi-chowdary #tollywood #anil-ravipudi #venkatesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe