AP: ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదన్నారు.

New Update
AP: ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

MLA Vemireddy Prashanthi Reddy: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని D.L.N.R ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసే కార్యకమంలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చొరవతో ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణి చేపట్టామన్నారు.

Also Read: ప్రజాస్వామ్యం గాడితప్పలేదు.. జగన్ కే మైండ్ దొబ్బింది.. ఎమ్మెల్యే బొలిశెట్టి సీరియస్ కామెంట్స్.!

మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యా రంగానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మెగా డిఎస్సిపై (Mega DSC) తొలి సంతకం చేసిన నేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదన్నారు. విద్యా బోధనతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Also Read: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..!

ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన చేయాలన్నారు. విద్యార్థులకు క్రమ శిక్షణ చాలా అవసరమని ఇంటర్మీడియట్లో తప్పటడుగులు పడకుండా అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు