AP: ప్రజాస్వామ్యం గాడితప్పలేదు.. జగన్ కే మైండ్ దొబ్బింది.. ఎమ్మెల్యే బొలిశెట్టి సీరియస్ కామెంట్స్.! వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆర్బీకే కేంద్రాలు.. రైతులను బాధపెట్టే కేంద్రాలని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ మాత్రం గాడితప్పలేదని.. జగన్ కే మైండ్ దొబ్బిందని బొలిశెట్టి ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 12 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MLA Bolishetty Srinivas: వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. RTVతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్బీకే కేంద్రాలతో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఆర్బీకే కేంద్రాలు.. రైతు భరోసా కేంద్రాలు కాదని.. రైతును బాధపెట్టే కేంద్రాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..! ఆర్బీకే కేంద్రాల వల్ల రైతులకు ఉపయోగం ఏమీ లేదన్నారు. ఇన్నాళ్లూ మత్తు నిద్రలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో రైతులకు జగన్ ఏం చేశాడు? ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకుండానే పంట సాయం ఇవ్వాలంటాడు .. అసలేం మాట్లాడుతున్నాడో అతనికి అర్ధమవుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికార దాహంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై కార్పొరేషన్ లో వేలాది కోట్లు అప్పు చేసి వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ మాత్రం గాడితప్పలేదని.. జగన్ కే మైండ్ దొబ్బిందని బొలిశెట్టి ధ్వజమెత్తారు. #bolishetty-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి