Vellampalli Srinivas: జగన్ పై రాయి దాడి.. ట్రోల్స్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ రియాక్షన్ ఇదే..! సీఎం జగన్ తోపాటు తన కంటి గాయంపై జరుగుతున్న ట్రోలింగ్స్ కు స్పందించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తమపై జరిగిన దాడిని మానవత్వం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని చంపాలని చూసిన వారిని పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా శిక్షిస్తుందన్నారు. By Jyoshna Sappogula 25 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP Vellampalli Srinivas: విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. జగన్ తోపాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి సైతం గాయం తగిలింది. అయితే, ఈ ఘటనపై ప్రతిపక్ష్యాలు రకరకాలుగా విమర్శలు గుప్పించారు. జగన్ దాడి కేవలం డ్రామా అని..సింపతి కోసం మళ్లీ కోడి కత్తి లాంటి నాటకాలు చేస్తున్నారని సెటైర్లు వుస్తూ వచ్చారు. అంతేకాదు..సీఎం జగన్ (CM Jagan) పై, వెల్లంపల్లిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వేశారు. Also Read: జగనన్న త్వరగా బ్యాండేజ్ తీసేయ్.. లేదంటే అంతే.. సునీత హెచ్చరిక..! అయితే తాజాగా, ఈ ట్రోలింగ్స్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి, తన కంటి పై జరిగిన దాడిని మానవత్వం లేకుండా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. కనీస విలువలు లేకుండా గాయాలపై జోకులు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై జోకులు వేసేవారికి, ట్రోల్స్ చేసే వారికి దేవుడు బుద్ధి చెప్తాడన్నారు. Also Read: ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు.. సోమిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ ముఖ్యమంత్రిని చంపాలని చూసిన వారిని పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా శిక్షిస్తుందన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. ఇంటిలిజెన్స్ డీజీ, విజయవాడ సిపి మార్పులు జరిగినంత మాత్రాన తాము తప్పు చేసినట్టు కాదన్నారు. ఇలాంటి ట్రాన్స్ఫర్స్ కి తాము భయపడమన్నారు. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. #ap-elections-2024 #cm-jagan #vellampalli-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి