Varun Tej: నేను ఇలా మారడానికి కారణం చిరంజీవి.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్
వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌లో పాల్గొన్న వరుణ్ చిరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటుడిగా మారడానికి పెద్దనాన్నే కారణమని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకొనే పైకి రావాలని చిరు చెప్పారన్నారు.
Varun Tej About Chiranjeevi: డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ నటించిన చిత్ర 'ఆపరేషన్ వాలెంటైన్'. సోనీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ ముద్ద నిర్మించారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఘర్షణలో (Pulwama Attack) భారత సైనికుల పై జరిగిన దాడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సరసన ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ (Manushi Chhillar) కథానాయికగా నటించింది. రహానీ శర్మ, నవదీప్, అలీరేజా ఎయిర్ ఫోర్స్ అధికారులుగా కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Operation Valentine Pre Release Event) ను నిర్వహించారు.
చిరంజీవి పై మెగా హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వరుణ్.. మీడియా ముందు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నేను యాక్టర్ అవ్వడానికి మా పెద్దనాన్న కారణం. మన మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి.. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం.. తన ఆశీర్వాదాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. చిన్న వయసు నుంచి పెదనాన్న మమల్ని చాలా బాగా పెంచారు. ఎల్లప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకొని పైకి రావాలని చెబుతుంటారు. ఇలాంటి ఎన్నో గొప్ప సలహాలతో పాటు మాకు ఇంత మంది మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని అందించారు. ఈ మెగా ఫ్యాన్స్ మమల్ని ఎప్పుడు ఒక బ్యాక్ బోన్ లా కాపాడుతూ ఉన్నారు" అంటూ చిరంజీవి పై తన ప్రేమ, గౌరవం, అభిమానాన్ని తెలిపారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కథ చేయడం గర్వంగా ఉందని చెప్పారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ మూవీతో వరుణ్ (Varun Tej) బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. మానుషీ చిల్లర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వరుణ్ కెరీర్ లో సినిమా మరో బిగ్గెస్ట్ హిట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read : Director Yashasvi : ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్
చిరంజీవి పై మెగా హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వరుణ్.. మీడియా ముందు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నేను యాక్టర్ అవ్వడానికి మా పెద్దనాన్న కారణం. మన మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి.. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం.. తన ఆశీర్వాదాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. చిన్న వయసు నుంచి పెదనాన్న మమల్ని చాలా బాగా పెంచారు. ఎల్లప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకొని పైకి రావాలని చెబుతుంటారు. ఇలాంటి ఎన్నో గొప్ప సలహాలతో పాటు మాకు ఇంత మంది మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని అందించారు. ఈ మెగా ఫ్యాన్స్ మమల్ని ఎప్పుడు ఒక బ్యాక్ బోన్ లా కాపాడుతూ ఉన్నారు" అంటూ చిరంజీవి పై తన ప్రేమ, గౌరవం, అభిమానాన్ని తెలిపారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో కథ చేయడం గర్వంగా ఉందని చెప్పారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ మూవీతో వరుణ్ (Varun Tej) బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. మానుషీ చిల్లర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వరుణ్ కెరీర్ లో సినిమా మరో బిగ్గెస్ట్ హిట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్