Vandebharat Express: వందేభారత్ రైళ్లో నాసీకరం భోజనం.. ప్రయాణికుడు చేసిన పనికి అందరూ షాక్..

వందేభారత్ రైళ్లో ప్రయాణించిన ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. తనకు తీసుకొచ్చిన భోజనం నాసీకరంగా ఉండటంతో.. దాన్ని వీడియో తీసి ఎక్స్‌లో పోస్టు చేశారు. తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగివ్వాలంటూ కోరాడు. దీనిపై రైల్వే సేవ విభాగం సానుకూలంగా స్పందించింది.

New Update
Vandebharat Express: వందేభారత్ రైళ్లో నాసీకరం భోజనం.. ప్రయాణికుడు చేసిన పనికి అందరూ షాక్..

ప్రస్తుతం దేశంలోని పలు రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ రైళ్లతో పోలిస్తే ఇందులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ రైళ్లలో టికెట్ ధర కూడా కాస్త ఎక్కవగానే ఉంటుంది. తొందరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు చాలామంది వందేభారత్ రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు ఇందులో నాణ్యమైన ఆహారం కూడా అందిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే తాజాగా వందేభారత్ రైళ్లలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఇక వివరాల్లో వెళ్తే ఆకాశ్‌ కేసరీ అనే ప్రయాణికుడు ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్నారు. అయితే అతనికి రైల్వే సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసీరకంగా ఉంది. అంతేకాదు దాని నుంచి దుర్వాసన కూడా వచ్చింది. భోజనం అలా ఉండటాన్ని చూసిన ఆ ప్రయాణికుడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో వెంటనే తనకు ఇచ్చిన భోజనాన్ని వీడియో చేసి ఎక్స్‌ (ట్వి్ట్టర్‌)లో పోస్టు చేశారు. అలాగే ఇండియన్‌ రైల్వేస్‌, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ల ఖాతాలకు కూడా ఈ పోస్టును ట్యాగ్ చేశారు.

Also Read: ఇండియా నుంచి మరో కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ఎలాంటి స్ట్రెయిన్‌కైనా చెక్‌ పెట్టే టీకా!

భోజనం సరిగా లేనందుకు తన డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ కోరారు. భోజన విక్రయదారులు వందేభారత్ రైలు పేరును అపకీర్తిపాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే సేవ విభాగం స్పందించింది. రైల్‌ మదద్‌ పోర్టల్‌లో ఫిర్యాదును నమోదు చేశామని చెబుతూ.. అందుకు సంబంధించిన ఐడీ నంబర్‌ను కూడా రైల్వే సేవ విభాగం ఎక్స్‌లో పోస్టు చేసింది.

అలాగే.. పీఎన్‌ఆర్‌, మొబైల్‌ నెంబర్లను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమకు అందించాలని కోరింది. మరోవైపు ఈ పోస్టుపై ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కూడా తన స్పందనను తెలియజేసింది. ప్రయాణికునికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చింది.

Also Read: రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ కూడా వస్తారు.. వీహెచ్‌పీ సంచలన ప్రకటన..

Advertisment
Advertisment
తాజా కథనాలు