Valentine Week: ప్రేమ...ఈ రెండక్షరాల పదానికి ప్రపంచంలో దేనికీ లేనంత పవర్ ఉంది. దీంతో ఏ పనైనా చేయొచ్చు. అలాంటి ప్రేమకు మనం ఇచ్చుకున్న ఒక రోజే వాలెంటైన్స్‌డే (Valentine Day). అయితే దీనిని కేవలం ఒక్కరోజు జురుపుకుని సరిపెట్టుకోరు ప్రేమికులు. వాలెంటైన్ వీక్ పేరుతో వారం రోజులు జరుపుకుని మురిసిపోతారు. ఏడాదికి సరిపడా ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకూ జరుపుకునే వాలెంటైన్ వీక్ చాలా ప్రత్యేకమైనది. ఈ వారం రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది.
ఫిబ్రవరి 7..రోజ్ డే..
ప్రేమకు చిహ్నం ఎర్ర గులాబీ. ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే పువ్వు ఇది ఒక్కటే. అందుకే వాలెంటైన్ వీక్‌లో రోజ్ డేను (Rose Day) చేర్చారు. లవర్స్ తమ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఎర్రగులాబీని ఇచ్చిపుచ్చుకుంటారు.
ఫిబ్రవరి 8..ప్రపోజ్ డే..
ఇప్పటి వరకూ మీరు ప్రేమిస్తున్న అమ్మాయికి లేదా అబ్బాయికి మీ ప్రేమ గురించి చెప్పలేదా...అయితే ఇంతకంటే మంచి రోజు ఇంకోటి ఉండదు. తమకి ఉన్న భావాలని తమ పార్టనర్‌కి చెప్పాలనుకుంటే ఈ రోజు ఆ పని చేయొచ్చు. మనతో జీవితాంతం కలిసి ఉండేందుకు మన పార్టనర్‌కు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రపోజ్ (Propose Day) చేయవచ్చును.
ఫిబ్రవరి 9.. చాక్లెట్స్ డే..
ప్రేమ అంటే తీపి. అలాంటి తీపిని మరింత పెంచేవి చాక్లెట్స్. మన ప్రేమను మరింత మధురం చేసుకోవాలంటే లవర్స్‌కు చాక్లెట్స్ ఇవ్వాల్సిందే. చాక్లెట్స్‌లో ఉండేంత రొమాంటిసిజం మరెక్కడా ఉండదు. అందుకే వాలెంటైన్ వీక్‌లో చాక్లెట్ డేను (Chocolate Day) పెట్టారు. ఈరోజు లవర్స్ చాక్లెట్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు.
ఫిబ్రవరి 10..టెడ్డీ డే..
ప్రమేలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం చాలా సర్వసాధారణం. అయితే ఇందులో టెడ్డీ బొమ్మకు (Teddy Day) ఒక ప్రత్యేక స్థానమే ఉంది.టెడ్డీస్ అనేది అమ్మాయిలకి మోస్ట్ ఫేవరేట్. ఇవి అమ్మాయిల పక్కన ఉంటే తమకి దగ్గరైన వ్యక్తి ఉన్నట్లుగానే ఫీల్ అవుతారు. ఇలాంటి బొమ్మల్ని గిఫ్ట్‌గా ఇచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ మనసుని గెలుచుకోవచ్చు.
ఫిబ్రవరి 11..ప్రామిస్ డే..
ప్రేమ అంటే నమ్మకం. దాని పునాదుల మీదనే జీవితాలు నిలబడతాయి. అలా అయితే ప్రేమ బలంగా ఉంటుంది. జీవితాంతం కలిసి ఉంటారు. ఇలాంటి ప్రేమని జీవితాంతం అందిస్తామని ఈ రోజున తమ పార్టనర్‌కి మాట ఇస్తారు. అలాంటి ప్రామిస్‌లకు (Promise Day) కేటాయించిన డే నే ఇది. నీకు తోడుగా జీవితాంతం ఉంటాను అని మీరు మీ పార్టనర్‌కు చెప్పాలనుకుంటే ఇంతకంటే మంచి రోజు ఉండదు.
ఫిబ్రవరి 12..హగ్ డే..
రొమాన్స్ లేని ప్రేమ ఉండదు. హెల్తీ రొమాన్స్...ఆరోగ్యకరమైన ప్రేమకు చిహ్నం. బాధలో ఉన్నా, సంతోషంలో ఎవరినైనా కౌగిలించుకుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి కౌగిలింత (Hug Day) అనేది రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం. దీని వల్ల ఒకరి ఆప్యాయతని అందుకోవచ్చు. అందుకే వాలెంటైన్ వీక్‌లో దీనికి ఒకరోజును కేటాయించారు.
ఫిబ్రవరి 13..కిస్ డే..
కౌగిలి నెక్స్ట్ స్టేజ్ కిస్సింగ్. ఇది ప్రేమను మరింత బలపడేలా చేస్తుంది. మాటలతో చెప్పలేని భావాలను ముద్దులతో చెప్పొచ్చు ఒక్కోసారి. దీని కోసమే కిస్ డే (Kiss Day) ను పెట్టారు. ముద్దు ముద్దుగా ముద్దు పెట్టి ప్రేమలో తేలియాడమని చెబుతున్నారు.
ఫిబ్రవరి 14..వాలెంటైన్ డే...
ఇదే ఆఖరి రోజు. అన్నింటికన్నా ముఖ్యమైన రోజు. మొదటి ఆరు రోజులూ మిస్ అయ్యారా...ఏమీ చెయ్యలేకపోయారా..ఏం పర్లేదు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే (Valentine Day) నాడు అన్నీ కలిపి ఒకేసారి చేసేయండి. మనసులో ఉన్న ప్రేమనంతా గుప్పించేయండి. రోజంతా కలిసిమెలిసి తిరుగుతూ హాయిగా ఎంజాయ్ చేయండి. ప్రేమ తన్మయత్వంలో ఓలలాడండి.
ప్రేమ అనేది కలకాలం ఉండాల్సిందే. ఒక్కరోజుతో...ఒక వారంతో పోయేది కాదు. వారం రోజులు చూపిస్తూ ఇంక అక్కర్లేదు అని కూడా అనుకోకూడదు. బతికున్నంత కాలం చూపించాల్సిన ప్రేమ వారం రోజుల్లో కచ్చితంగా చూపించలేము. కానీ ఇదొక సందర్భం...మనకెంత ప్రేముందో వ్యక్తపరచడానికి. ఏడాది మొత్తం మన పనులు మానుకుని సెలబ్రేట్ చేసుకోలేము కాబట్టి ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక అవకాశం అంతే. అయితే సెలబ్రేట్ చేసుకుంటే ప్రేమ ఉన్నట్టా అంటే అది కూడా కాదు. కానీ, ఆ ప్రేమని ఓ పండుగలా..ఎక్స్‌ప్రెస్ చేసేందుకు మాత్రం ఈ వీక్, వాలెంటైన్ డే అని చెబుతారు.
Also Read:Loksabha:పేపర్ లీక్ నిరోధక బిల్లుకు లోక్‌సభలో ఆమోదం