Hug Day : ప్రేమికుల వారం(Valentine Week) లో ఆరో రోజుకి చేరుకున్నాం. ఈరోజును హగ్ డే(Hug Day) గా ప్రేమికులు(Lovers) జరుపుకుంటారు. కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు. అలాంటి కౌగిలింతలకు కూడా ఓ రోజు ఉంది.
వాలంటైన్ వీక్(Valentine Week) లో హగ్ డేకి ఉన్న ప్రత్యేకతే వేరు. మరి ఈ హగ్ డే రోజున మీ ప్రియమైన భాగస్వామికి, ప్రియురాలు, ప్రియునికి ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చి హగ్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా మంది ప్రేమికులు దూరంగా ఉండి కూడా ప్రేమించుకుంటుంటారు. మరి కొంతమంది ఈ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి వస్తుంది.
అటువంటి వారు తమ ప్రియమైన వారు దగ్గర లేరని బాధపడకుండా ఓ పిల్లోని బహుమతిగా ఇచ్చి హగ్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అదేలా అంటే మీరు బహుమతిగా ఇచ్చే పిల్లో మీద మీ ఫోటోనో లేక మీ ఇద్దరి ఫోటోనో ప్రింట్ చేయించి బహుమతిగా ఇచ్చినట్లయితే మీరు దూరంగా ఉన్న సందర్భంలో మీ భాగస్వామి దానిని గట్టిగా హగ్ చేసుకోవడం వల్ల మీరే వారి దగ్గర ఉన్న ఫీలింగ్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ప్రియమైన వారికి బహుమతిని రెడీ చేసేసుకోండి మరి.
అంతేకాకుండా ఈ రోజుని మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి మీ భాగస్వామికి మంచి కవిత్వాలు వినిపించి కూడా కౌగిలిలో బంధించవచ్చు.
Also Read : Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి!
1. నీ హృదయం నీ దగ్గర లేదు.. ఎందుకంటే అది నా దగ్గర ఉంది.
ఈరోజున ప్రపంచంలోని అన్ని ఆచారాలను విచ్చిన్నం చేయగలనని కోరుకుంటున్నాను.
నేను నీతో ఉండాలనుకుంటున్నాను,
నాకు నీ చేయి కావాలి, మీ చేతుల్లో ఉండటానికి,
నాకు పగలు రాత్రి కావాలి.
హ్యాపీ హగ్ డే...
2) కొందరు దీనిని మ్యాజిక్ హగ్(Magic Hug) అని పిలుస్తారు,
ఎవరైనా దానిని ప్రేమ అని పిలవవచ్చు,
ఏది ఏమైనా ఈ సందర్భం అందంగా ఉంది,
వచ్చి నన్ను కౌగిలించుకో, మిత్రమా.
హ్యాపీ హగ్ డే...
3) రోమియో జూలియట్‌కి చేసినట్లు,
లైలా మజ్నుకి చెప్పినట్లు,
హీర్ రంజాకు చెప్పినట్లుగా,
నేను నిన్ను కౌగిలించుకున్నాను ప్రియ,
నువ్వు కూడా నన్ను అలాగే కౌగిలించుకో ప్రియతమా.
హ్యాపీ హగ్ డే...
4) ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవడం ద్వారా,
నా గుండె చప్పుడు వినండి,
అప్పుడు మేము మీకు తిరిగి ఇచ్చే నిర్ణయాన్ని వదిలివేస్తాము.
హ్యాపీ హగ్ డే...
ఇలా కవితల కౌగిలింతలో మీ భాగస్వామిని(Partner) బంధించేయండి మరి. కేవలం హగ్ డే రోజున హగ్ మాత్రమే కాకుండా మీ ప్రియమైన వారికి బహుమతుల ద్వారా కూడా మీ ప్రేమను తెలియజేయవచ్చు.
Also read: మరోసారి రోడ్డెక్కనున్న రైతు సంఘాలు.. చలో ఢిల్లీ తో పోలీసులు అలర్ట్.. ట్రాఫిక్ మళ్లింపు!