V V Vinayak : 'విశ్వంభర' సెట్స్ లో స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న పిక్!

'విశ్వంభర' మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ తాజాగా సెట్స్ కి వెళ్లాడు. ఈ సందర్భంగా డైరెక్టర్ వశిష్ఠకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

New Update
V V Vinayak : 'విశ్వంభర' సెట్స్ లో స్టార్ డైరెక్టర్.. వైరల్ అవుతున్న పిక్!

V V Vinayak Visits Vishwambhara Sets : 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుండగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ సెట్స్ కి వెళ్లాడు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వశిష్ఠకి (Director Vassishta) శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. కాగా ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫోటోను డైరెక్టర్ వశిష్ట తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : ప్రభాస్ తల్లిగా మృణాల్ ఠాకూర్.. ‘కల్కి’ లో అసలు ట్విస్ట్ అదే!

వినాయక్ ఉన్నట్టుండి ఇలా మెగాస్టార్ ను కలవడంతో వీరి కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోసారి ఈ ఇద్దరూ సినిమా చేయబోతున్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇక చిరంజీవి - వినాయక్‌ మధ్య మంచి అనుబంధం ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 వంటి హిట్ సినిమాలు వచ్చాయి. కాగా విశ్వంభర మూవీ సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈమూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు