Viral Video : వార్నీ బండ బడా.. బతికిపోయావ్ ఫో.. ఇంకెప్పుడూ ఇలా రోడ్డెక్కకు..!

ఇంటర్‌నెట్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. రోడ్డు దాటేపుడు చూసుకోని ఓ బైకర్‌ రహదారిపైకి అడ్డంగా వచ్చాడు. అదే సమయంలో స్పీడ్‌గా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. లక్‌ ఏంటంటే బైకర్‌కు ఏం కాలేదు. అటు కారు డ్రైవర్‌ హిట్ అండ్‌ రన్‌ చేశాడు.

New Update
Viral Video : వార్నీ బండ బడా.. బతికిపోయావ్ ఫో.. ఇంకెప్పుడూ ఇలా రోడ్డెక్కకు..!

Viral Video Road Rash : నిర్లక్ష్యానికి చెల్లించుకో తప్పదు భారీ మూల్యం.. రోడ్డుపై వెళేప్పుడు ఒళ్లు, కళ్లు, కాళ్లు, చేతులు, తల ఇలా అన్ని దగ్గర పెట్టుకోనే ఉండాలి. లేకపోతే తలకాయి లేచిపడుతుంది. చేతులు విరిగిపడతాయి.. కాళ్లు అష్టవంకరులు పోతుంది. నిజానికి రోడ్డు(Road) పై మన తప్పు లేకున్నా అవతలి వాళ్ల తప్పు ఉన్నా మనమే బలైపోవాల్సి రావొచ్చు. రెప్పపాటులో ఎగిరిపోయే ప్రాణాన్ని కాపాడుకోవడానికి రోడ్డుపై జాగ్రత్త తప్పనిసరి. ఇక ఇంటర్‌నెట్‌(Internet) లో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. రోడ్డు యాక్సిడెంట్లకు సంబంధించి వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి వైరల్‌ అవుతోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.


బతికిపోయాడు..:
ఓ వీడియోలో కారు దూసుకుపోతుంది. గేర్లు మార్చి రయ్‌ రయ్‌ అని దూసుకుపోతున్నాడు ఓ డ్రైవర్. టాప్‌ గేర్‌లో ఉన్నాడు. నిజానికి ఆ రోడ్డుపై స్పీడ్‌పై వెళ్లడం సాధారణమే. అలాంటి రోడ్డుపైకి ఎవరైనా వస్తున్నారంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఓకవేళ రోడ్డు దాటాల్సి వస్తే ఎంత ఆచితూచి వ్యవహరించాలి? ఇవ్వని తెలియని ఓ వ్యక్తి బైక్‌పై నిర్లక్ష్యంగా రోడ్డు దాటాడు. అంతే బైక్‌ను కారు గిరాటేసింది. బైక్‌ ముక్కలు ముక్కలు అయ్యింది. అదృష్టం ఏంటంటే అతని ప్రాణానికి ఏమీ కాలేదు. బైక్‌ మాత్రం చెల్లాచెదురుగా పడింది.
హిట్‌ అండ్‌ రన్:
సీసీ కెమెరా(CC Camera) లను బట్టి చూస్తే ఈ ఘటన ఈ ఏడాది జనవరి 2న జరిగినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 12గంటల 9నిమిషాలకు ఈ యాక్సిడెంట్‌(Accident) జరిగింది. ఆ సమయంలో అక్కడే కొంతమంది ఉన్నా ఏ ఒక్కరు కూడా ఉలుకు పలుకు లేకుండా కనిపిస్తున్నారు. ఓ వ్యక్తి కిందపడితే.. యాక్సిడెంట్‌కు గురైతే అతని వద్దకు కూడా ఎవరూ రాలేదు. మరోవైపు బైక్‌ను ఢీకొట్టినకారు ఎక్కడా ఆగకుండా దూసుకుపోయింది. ఓ వ్యక్తిని కిందపడ్డాడు.. మనం డ్యాష్‌ ఇచ్చాం.. ఉన్నాడో పోయాడో.. ఎదైనా హెల్ప్‌ కావాలో చూద్దాం అని కనీసం ఆగలేదు ఆ డ్రైవర్‌. నిజానికి ఇది చట్ట ఉల్లంఘన. కొత్త చట్టాల ప్రకారం హిట్‌ అండ్‌ రన్‌(Hit & Run) కు పదేళ్ల జైలు శిక్ష ఉంది. అయినా కూడా సంబంధిత డ్రైవర్‌ ఆగే ప్రయత్నం చేయలేదు.

Also Read: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు