ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలి 40 మంది కూలీలు అందులో చిక్కుకున్న సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషాద ఘటన జరిగి నాలుగు రోజులు పూర్తైన కూడా ఇంకా బాధితులు సురక్షితంగా అందులో నుంచి బయటపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 100 గంటలు ముగినప్పటికీ కూడా సహాయక బృందాలు టన్నెల్ నుంచి బాధితులను బయటకు తీసేందుకు ఇంకా చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో అందులో చిక్కుకుపోయిన కూలీల ఆరోగ్యంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే వారికి సొరంగంలోని నీటి సరఫరా కోసం వేసిన పైప్‌లైన్ నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. అలాగే అదే పైపు ద్వారా తాగునీరు, ఆహార పదార్థాలను కూడా అందిస్తున్నారు. బాధితులు ఎప్పుడు సొరంగం నుంచి బయటపడతారు అనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు.
Also Read: తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది.. చిదంబరం కీలక వ్యాఖ్యలు!
ఇదిలాఉండగా.. ఈ నెల 12న ఆదివారం ఉదయం ఉత్తరకాశీలో చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగంలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది కూలీలు ఆ సొరంగంలోనే చిక్కుకుపోయారు. సొరంగం ప్రవేశ ద్వారం నుంచి 200 మీటర్ల దూరంలో వారందరూ చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అలాగే శిథిలాలు కూడా దాని ముందు 50 మీటర్ల వరకు పడిపోయాయి. వాళ్లను సరక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నార్వే, థాయ్‌లాండ్‌కు చెందిన నిపుణుల బృందాల సాయం తీసుకుంటున్నాయి.
Also Read: అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే