ఓరి వీడి తెలివి పాడుగాను.. అంబులెన్స్‌లో గంజాయిని తరలించాడు.. ఎలా దొరికాడంటే ఉత్తరఖాండ్‌లోని అంబులెన్స్‌లో గంజాయిని తరలిస్తున్న రోషన్ (38) అనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అంబులెన్స్‌లో దాదాపు 218 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.33 లక్షలు ఉంటుందని తెలిపారు. By B Aravind 09 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఈ మధ్య దొంగలు, నేరస్థులు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు అనేక పన్నాగాలు పన్నుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా అంబులెన్స్‌లోనే గంజాయిని తరలించాడు. ఇలా అంబులెన్స్‌లో వెళ్తే.. మనల్నెవరు ఆపుతారులే అని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. అతడి అతి తెలివి ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన ఉత్తరఖాండ్‌లో జరిగింది. ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..' పౌరి గర్వార్ జిల్లాకు చెందిన రోషన్ లాల్ (38) అనే వ్యక్తి సరైకేట్ నుంచి కాశీపూర్ వైపుగా గంజాయిని అంబులెన్సులో తరలిస్తున్నాడు. మోహాన్ చెక్‌పోస్టు వద్దకు రాగానే పోలీసులు ఆ అంబులెన్సును గమనించారు. వారిని చూసిన రోషన్.. వెంటనే చెక్‌పోస్టు దాటాలని అనుకున్నాడు. కానీ పోలీసులు ఆ అంబులెన్స్‌ను ఆపి అతడ్ని వివరాలు అడిగారు. Also Read: ఐటీ దిగ్బంధంలో పొంగులేటి.. నామినేషన్ వేస్తారా.. లేదా..? దీనికి రోషన్.. అంబులెన్స్‌లో ఒక పెషెంట్‌ను అత్యవసరంగా హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని చెప్పాడు. కానీ ఆ అంబులెన్స్‌లో పోలీసులు చెక్ చేయగా అందులో ఎవరూ లేరు. ఇక రోషన్ వెంట ఉన్న మరోవ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఆ అంబులెన్స్‌లో ఉన్న ముఠాల్లో ఇవి ఏంటి అని అడగగా.. కురగాయాలు, స్నాక్స్ అంటూ రోషన్ బదులిచ్చాడు. చివరికి వాటిని తెరిచి చూడగా 218 కేజీల గంజాయి కనిపించింది. దీని విలువ దాదాపు రూ.33 లక్షలని' పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రోషన్‌పై కేసు నమోదు చేశామని.. అతని వెండి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చిలో దెహ్రదూన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అంబులెన్స్‌లో లిక్కర్ తరలిస్తున్న నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. Also Read: పండుగకు దేశీ ఉత్పత్తులనే వాడండి..ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ #telugu-news #national-news #ganja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి