Jayaprada: నటి జయప్రద మిస్సింగ్‌ ..వెతుకుతున్న పోలీసులు!

నటి , బీజేపీ నాయకురాల జయప్రద కనిపించడం లేదని ఉత్తర్‌ప్రదేశ్‌ రామ్‌పూర్‌ జి్లలాలో మిస్సింగ్‌ కేసు నమోదు అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల నియమాళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమె పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది.

New Update
Jayaprada: నటి జయప్రద మిస్సింగ్‌ ..వెతుకుతున్న పోలీసులు!

ప్రముఖ నటి, బీజేపీ (BJP)  నాయకురాలు , లోక్‌సభ మాజీ ఎంపీ జయప్రద (Jayaprada) గత కొద్ది రోజులుగా కనిపించడం(Missing)  లేదు. ఆమె కోసం ఉత్తరప్రదేశ్‌ (Uttarapradesh)  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను వెతకడం కోసం పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్‌ టీమ్‌ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆమె మిస్సింగ్‌ కేసు కూడా నమోదు కావడం గమనార్హం.

కొంతకాలం క్రితం నటి జయప్రద పై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ (Arrest Warrent)  జారీ అయిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో నటి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమె పై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆ సమయంలో ఆమె ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఆమె రామ్‌పూర్‌ లోక్‌ సభ పరిధిలో రోడ్లను ప్రారంభిచారు.

అంతేకాకుండా మరోచోట నిర్వహించిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. ఇంతకు ముందే ఆమెకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలంటూ చాలాసార్లు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసులో ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆమె పై ఆగ్రహాన్నీ వ్యక్తం చేశారు. జనవరి 10 లోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలంటూ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ క్రమంలో ఆమె గురించి ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. గడువు దగ్గరపడుతుండటంతో రామ్‌పూర్‌ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ టీమ్‌ కూడా జయప్రద ఆచూకీని కనిపెట్టలేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జయప్రద ఆచూకీ మరికొన్ని బృందాలను కూడా ఏర్పాటు చేస్తామని జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. న్యాయమూర్తి ఇచ్చిన గడువులోగా ఆమెను న్యాయస్థానంలో హాజరు పరుచుతామని ఆయన అన్నారు.

Also read: న్యూ ఇయర్‌ రోజున మీ లవర్‌కి ఈ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. బ్రేకప్ అవ్వొచ్చు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు